Kavitha : కవితకు ఇప్పట్లో బెయిల్ కష్టమే!

లిక్కర్ కేసులో కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఇప్పట్లో కవిత బయటకు రావడం కష్టమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 2, 2024 | 01:30 PMLast Updated on: Jul 02, 2024 | 1:30 PM

Kavita Is Getting Shocks After Shocks In The Liquor Case

లిక్కర్ కేసులో కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. ఇప్పట్లో కవిత బయటకు రావడం కష్టమేనా అంటే.. పరిస్థితులు చూస్తుంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవితకు.. మళ్లీ నిరాశే ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కుంభకోణంలో కవిత ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయ్‌. ప్రస్తుతం ఆమె తీహార్​ జైల్‌లో ఉన్నారు. ఐతే తనకు బెయిల్ కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కవిత సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఆమె తీహార్ జైల్లో 108రోజులుగా ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ట్రయల్ కోర్టును కోరింది. ఐతే ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం బెయిల్ తిరస్కరించింది. PMLA సెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని.. ఆమె 100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని కవిత తరపు న్యాయవాది వాదించారు.

కవితకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ, ఈడీ వాదించింది. సీబీఐ, ఈడీ వాదనతో ఏకిభవించిన కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఐతే కవిత అంత ఈజీగా బయటకు వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఆమె మీద సీబీఐతో పాటు ఈడీ కేసు కూడా ఉంది. రెండు కేసుల్లోనూ బెయిల్‌ వస్తేనే.. కవిత జైలు నుంచి బయటకు వచ్చే చాన్స్ ఉంది. ఒక కేసులో బెయిల్ దొరికి.. మరో కేసులో లభించకపోతే.. మళ్లీ తీహార్‌ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య.. కవిత జైలు నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కేజ్రీవాల్ విషయంలో అదే జరిగింది. బెయిల్‌ను సీబీఐ, ఈడీ అడ్డుకున్నాయ్. ముందు లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఐతే ఆ తర్వాత ఈ కేసులో ఆయనకు కోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆ తర్వాత సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇలా ఒక కేసులో బెయిల్ ఉన్నా.. మరో కేసులో రాకపోవడంతో జైలుకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పుడు కవిత విషయంలోనూ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ వస్తేనే బయటకు వస్తారు. లేదంటే అప్పటివరకు జైల్లోనే ! మరి రెండు కేసుల్లో బెయిల్ వస్తుందా అంటే.. అది కష్టమే. కవిత పాత్రపై పక్కా ఆధారాలు ఉన్నాయని అటు సీబీఐ, ఇటు ఈడీ అంటోంది. దీంతో కవితకు ఇప్పట్లో బెయిల్ లేనట్లే అనే చర్చ జరుగుతోంది.