KAVITHA ARREST : కవిత అరెస్ట్… ఢిల్లీకి తీసుకెళ్ళిన ఈడీ అధికారులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఏడుగురు అధికారుల బృందం మధ్యాహ్నం నుంచి 6 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు జరిపింది. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ఇంట్లో సెర్చింగ్ చేశారు. కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఏడుగురు అధికారుల బృందం మధ్యాహ్నం నుంచి 6 గంటల పాటు కవిత ఇంట్లో సోదాలు జరిపింది. ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ఇంట్లో సెర్చింగ్ చేశారు. కవిత స్టేట్మెంట్ రికార్డు చేశారు. కవితకు చెందిన రెండు పర్సనల్ మొబైల్స్ తో పాటు… ఇంట్లోని మొత్తం 16 మొబైల్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనేక కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అరెస్ట్ వారంట్ జారీ చేసిన తర్వాత ఆ కాపీని కుటుంబ సభ్యులకు అందించారు ఈడీ అధికారులు.
అరెస్ట్ సంగతి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు… కవిత ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు ఇద్దరు నేతలను భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దన్న ఈడీ అధికారులపై మండిపడ్డారు కేటీఆర్, హరీష్ రావు. తర్వాత ఇంట్లోకి వెళ్ళిన కేటీఆర్… కవిత అరెస్ట్ పై ఈడీ అధికారులతో గొడవపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళతారని వాదించారు. అంతేకాదు… సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా… అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు కేటీఆర్. సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి మాట తప్పుతున్నారనీ… కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈడీ అధికారులను హెచ్చరించారు. కావాలనే శుక్రవారం నాడు వచ్చారని కూడా కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు అవకాశం లేదంటూనే… అరెస్టు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కవితను తరలించే టైమ్ లో కేటీఆర్ ను హత్తుకొని ఏడ్చారు కవిత.
ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పార్టీ లీడర్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈడీ అక్రమ రెస్టును న్యాయపరంగా, శాంతి యుతంగా ప్రజాస్వామ్య యుతంగా ఎదుర్కొంటామని పార్టీ నాయకులు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి 8 గంటల 55 నిమిషాలకు ఫ్లయిట్ బుక్ చేసి కవితను ఢిల్లీకి తీసుకెళ్ళారు. కవిత అరెస్ట్ ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీష్ రావు కోరారు. కవిత కారు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు…. బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మోడీ, బీజేపికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా పోలీసులు భారీ భద్రత కల్పించారు. కార్యకర్తలను చెదరగొట్టారు. కవితను ఎయిర్ పోర్టుకు తీసుకెళ్ళే రూట్ ని క్లియర్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మరికొందరు బీఆర్ఎస్ లీడర్లకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.