తండ్రి చెంతకు కవిత, ఎమోషనల్ అయిన కేసీఆర్

దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు బెయిల్ పై విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఆరు నెలల తర్వాత తండ్రి కేసీఆర్ ను చూసారు కవిత.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2024 | 01:51 PMLast Updated on: Aug 29, 2024 | 1:51 PM

Kavitha Is Emotional And Kcr Is Emotional

దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టకేలకు బెయిల్ పై విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఆరు నెలల తర్వాత తండ్రి కేసీఆర్ ను చూసారు కవిత. నిన్న హైదరాబాద్ చేరుకున్న ఆమె నేడు కేసీఆర్ నివాసం వద్దకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఎర్రవెల్లి ఫాం హౌస్ లో కాస్త ఉద్విగ్న వాతావరణం కనపడింది. కవిత భారీ కాన్వాయ్ తో కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు.

ఆ తర్వాత పార్టీ నేతలు, రాజ్యసభ ఎంపీ సంతోష్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహా పలువురు కవితకు ఘన స్వాగతం పలికారు. జీవన్ రెడ్డి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ కాళ్ళకు నమస్కరించారు కవిత. అనంతరం ఆయన చేతిని ముద్దాడి కాసేపు ముచ్చటించారు. కవిత రావడంతో ఫాం హౌస్ లో సందడి వాతావరణం నెలకొంది. కేసీఆర్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఫాం హౌస్ లో నేతలు అందరూ ఉత్సాహంగా కనపడిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.