కావ్యా పాప నవ్విందోచ్, జట్టు విజయంతో ఫుల్ ఖుషీ
ఐపీఎల్ ఎప్పుడు జరిగినా ఆటగాళ్ళ మీదే ఫోకస్ ఉండడం కామన్... కానీ ఈ క్యాష్ రిచ్ లీగ్ ఎప్పుడు జరిగినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఐపీఎల్ ఎప్పుడు జరిగినా ఆటగాళ్ళ మీదే ఫోకస్ ఉండడం కామన్… కానీ ఈ క్యాష్ రిచ్ లీగ్ ఎప్పుడు జరిగినా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ముఖ్యంగా తన జట్టు ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు.. వికెట్లు తీసినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. ఐపీఎల్ లో కావ్యా మారన్ కు కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందనేది అంగీకరించాల్సిందే.. కాగా 18వ సీజన్ లో మాత్రం తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత సన్ రైజర్స్ వరుసగా నాలుగు మ్యాచ్ లలో పరాజయం పాలైంది. జట్టు వరుస ఓటముల సమయంలోనే కావ్య హావభావాలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో గెలిచిన తర్వాత మళ్ళీ కావ్యా పాప మొహంలో నవ్వు కనిపించింది.
ఒక వారం క్రితం అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. అప్పుడు కావ్య మారన్ కోపంతో ఊగిపోయింది. ఫ్రస్టేషన్ బయట పెట్టిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆ సమయంలో ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కోపంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ శనివారం అభిషేక్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో ఆమె ముఖంలో చిరునవ్వు తెచ్చాడు. సన్‌రైజర్స్ వరుస ఓటములకు బ్రేక్ పడటంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.
అభిషేక్ 10 సిక్స్‌లు, 14 బౌండరీలతో తన తొలి ఐపీఎల్ శతకం సాధించాడు. స్టేడియంలో ఉన్న అభిమానులు అభిషేక్ శర్మ ఆడినంతసేపు సీట్లపై కూర్చోలేదు. అటు కావ్యా మారన్ కూడా ప్రతి బౌండరీకి లేచి.. అరుపులు కేకలతో హంగామా చేసింది. పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు అభిషేక్ చుక్కలు చూపించాడు. ఎక్కడ వేసినా బౌండరీలు కొడుతుండడంతో.. బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక ఛాహల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్.. తనదైన శైలిలో తన సెంచరీని ఎంజాయ్ చేశాడు. తన జేబులో నుంచి ఒక తెల్ల పేపర్ తీసి అందరికీ చూపించాడు. మొదట అసలు ఆ పేపర్‌లో ఏముందే ఎవ్వరికీ అర్థం కాలేదు. దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాశాడని కెమెరా జూమ్ చేశాక అర్జమైంది.. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నాడు. గెలిచినా, ఓడినా.. తమ టీమ్ కోసం ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉండే అభిమానుల కోసం అభిషేక్ శర్మ ఇలా పేపర్‌పై రాసి.. అందరికీ చూపించడం ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ని నింపింది.
ఈ మ్యాచ్ లో అభిషేక్ 141 పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే భారతీయ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు. 2013లో క్రిస్ గేల్ చేసిన 175 నాటౌట్, 2008లో బ్రెండన్ మెక్‌కుల్లమ్ చేసిన 158 నాటౌట్ తర్వాత ఇది మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు. అభిషేక్ ట్రిపుల్ ఫిగర్‌కు చేరుకున్నప్పుడు, కావ్య ఆనందంతో తన సీటు నుండి లేచి నిలబడి ఎగిరి గంతులేసింది. ఆమె హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్న 24 ఏళ్ల అభిషేక్ తల్లిదండ్రులను కలిసి వారిని అభినందించింది.