బాలయ్య అల్లుడ్ని టార్గెట్ చేసిన కేయే పాల్, ఎలక్షన్ ఫేక్…!

ఏపీలో జరిగిన ఎన్నికలు అవినీతి మయం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయే పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈవీఎంలు టాంపర్ అయ్యాయి అన్నారు ఆయన. 1800 బూత్ లలో మా ఓట్లు ఎలా మిస్సయ్యాయో ఆధారాలతో చెప్పా అన్న పాల్... మా ఫ్యామిలీ నుంచి 25 ఓట్లు వేస్తే...రెండే చూపించారు అని మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2024 | 01:00 PMLast Updated on: Aug 22, 2024 | 1:00 PM

Kaye Paul Who Targeted Balayya Allud Election Fake

ఏపీలో జరిగిన ఎన్నికలు అవినీతి మయం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయే పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈవీఎంలు టాంపర్ అయ్యాయి అన్నారు ఆయన. 1800 బూత్ లలో మా ఓట్లు ఎలా మిస్సయ్యాయో ఆధారాలతో చెప్పా అన్న పాల్… మా ఫ్యామిలీ నుంచి 25 ఓట్లు వేస్తే…రెండే చూపించారు అని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయినట్లే అన్ని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. ఈవీఎంలు వాడిన 50 దేశాలు … ఇప్పుడు బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి అన్నారు.

ఏపీలో ఎన్నికలు రద్దు చేయాలి అని డిమాండ్ చేసారు. మళ్లీ ఎన్నికలు జరిపించాలి అని కోరారు పాల్. శ్రీ భరత్ పేరు వైజాగ్ లో ఎవరికీ తెలియదు అన్నారు. చంద్రబాబు కొడుకు తోడల్లుడు , బాలకృష్ణ అల్లుడు అని చెబితే కానీ తెలియదు అని 55200 చర్చిలు,5 లక్షల ఓట్లు బీజేపీ మద్దతిచ్చిన భరత్ కు ఎలా పడ్డాయి అని నిలదీశారు. మీడియా ధైర్యంగా రిపోర్ట్ చేయండి అంటూ సవాల్ చేసారు. మీకు ఎవరైనా లైసెన్సులు ఆపేస్తే …నేను తిరిగి ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు. చంద్రబాబును అమెరికా రమ్మని నేను కోరా అన్నారు.

అక్టోబర్ 2న సమ్మిట్ పెడదామని చెప్పా అని చంద్రబాబు వీసా ఇచ్చిన కౌన్సిలర్స్ ను కలుస్తున్నారన్నారు. కౌన్సిలర్స్ ను కలిస్తే వీసాలు ఇస్తారు కానీ…అధ్యక్షులు సంతకాలు పెట్టరు అన్నారు. ఖజానాలో డబ్బులు లేవంటున్నారని నాతో రండి అప్పులు తీరుద్దాం …ఉద్యోగాలు సృష్టిద్దాం అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఇదే నా డెడ్ లైన్ వారం రోజుల్లోగా నన్ను కలవకపోతే…అక్టోబర్ 2 వ తేదీలోగా అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో దేవుడే నిర్ణయిస్తాడు అంటూ హెచ్చరించారు పాల్. వైజాగ్ ఎంపీ ఎన్నిక, గాజువాక ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్ చేసారు.