KCR: ఆటోడ్రైవర్లకు కేసీఆర్ వరాలు.. ప్రజా ఆశీర్వాద సభలో ప్రకటన..

ఆటో డ్రైవర్లు ఏడాదికి ఒకసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఫిట్‌నెస్‌కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు అయ్యే ఛార్జీలను ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తాం. దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 07:09 PMLast Updated on: Nov 20, 2023 | 7:09 PM

Kcr Announced Schemes To Auto Drivers In Telangana

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలోలాగా కాకుండా వీలైనన్ని ఎక్కువ హామీలు గుప్పిస్తున్నారిప్పుడు. తాజాగా ఆటో డ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో సోమవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తిరిగి అధికారంలోకి వస్తే.. ఆటో డ్రైవర్లకు ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్ నెస్ ఫీజు రూ.700, పర్మిట్ ఫీజు రూ.500 రద్దు చేస్తున్నారు. వీటిని రద్దు చేస్తామన్నారు.

KA PAUL: అంతన్నాడు.. ఇంతన్నాడు.. ఇక్కడ సీఎం.. అక్కడ ఎంపీ..! కేఏ పాల్ అంటే మజాకా?

“గ్రామాల్లో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. సాగునీటి పథకాలతో పొలాలు కళకళలాడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకుని పింఛన్లను పెంచాం. ఆటో డ్రైవర్లు ఏడాదికి ఒకసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఫిట్‌నెస్‌కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు అయ్యే ఛార్జీలను ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తాం. దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే మూడు గంట‌లు క‌రెంట్ ఇస్తామ‌ంటున్నారన్నారు. క‌ర్ణాట‌క‌లో 20 గంట‌ల క‌రెంట్ ఇస్తామని మాయమాటలు చెప్పి మూడు గంట‌ల కరెంట్ ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ తీసేసి భూమాతా పెడతామంటున్నారని, అది భూమాతానా? భూమేతనా? కాంగ్రెస్‌ పాలనే బాగుంటే ఎన్టీఆర్‌ టీడీపీని ఎందుకు పెడతారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి రూ.2లకే కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారు. కాంగ్రెస్ పాలనలోనే పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలిపోయాయి.

తెలంగాణ ఇస్తామన్నందుకే కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాం. అయినా తెలంగాణ ఇవ్వకపోయేసరికి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాం. సకలజనుల సమ్మె అంటూ మళ్లీ ఉద్యమం చేస్తే గానీ తెలంగాణ సాకారం కాలేదు. మీ భూముల హక్కులను మీకే ఇచ్చామన్నారు. మీ బొట‌న‌వేలితో మీ భూమి హ‌క్కు మారుతుంది. గ్రామాల్లో ఇండ్లు క‌ట్టుకున్నాం. ప‌ల్లెల్లో ప‌ల్లె ద‌వాఖానాలు, బ‌స్తీల్లో బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.