KCR : కేంద్రమంత్రిగా కేసీఆర్ ! బీజేపీతో BRS దోస్తీ ?
తెలంగాణలో BRS పార్టీ ఇక కనిపించదా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది.
తెలంగాణలో BRS పార్టీ ఇక కనిపించదా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏదో జరగబోతోందన్న టెన్షన్… పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీని రక్షించుకోడానికి, కవితను జైలు నుంచి బయటకు తేవడానికి కేసీఆర్ ఏ చేయబోతున్నారని పార్టీ శ్రేణులు టెన్షన్ గా వెయిట్ చేస్తున్నాయి.
BRSలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరిపోతున్నారు. ఇప్పటికే ఏడుగురు జాయిన్ అయ్యారు… మరో పది మంది రెడీగా ఉన్నారు. ఈ నెలాఖరులోగా మొత్తం 26 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని BRSLPని విలీనం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అటు ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల లోపు brsలో ఎవరు ఉంటారు… ఎవరు పోతారో తెలియట్లేదు. ఇప్పుడే ఇలాగ ఉంటే… వచ్చే నాలుగున్నరేళ్ళు పార్టీ ఎలా బతుకుతుందనే బెంగ కేసీఆర్ లో కూడా మొదలైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత తిహార్ జైల్లో సెంచరీ కొట్టేసింది. కుటుంబ సభ్యులు పరామర్శకు వెళ్ళినప్పుడల్లా… ఏం అన్నా… నన్ను బయటకు తీసుకుపోరా అని అడుగుతున్నారట. కవితను ఎలాగైనా జైలు నుంచి బయటకు తేవాలని కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నిద్రలేని రాత్రులు గడుపుతోంది. కవితను కేసు నుంచి తప్పిస్తే… అవసరమైతే BRSను మీ పార్టీలో కలిపేస్తాం అని కమలం పార్టీకి ఆఫర్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలోనే ఆరు రోజులుగా మకాం పెట్టారు కేటీఆర్, హరీశ్ రావు. అక్కడ బీజేపీ కీలక నేతలతో చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. హస్తినలో ఎవర్ని కలిశారు… ఆరు రోజులు ఎందుకున్నారు అన్నది మాత్రం సీక్రెట్. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరూ…. డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కెళ్ళి kcr తో జరిగిందంతా చెప్పారట. అయితే BRSతో పొత్తుకు ఒకరిద్దరు బీజేపీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ, అమిత్ షాని ఘోరంగా తిట్టిపోసి… ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎలా కుదురుతుందని అభ్యంతరం చెప్పారట. బీఆర్ఎస్ మాత్రం… రాబోయే సంక్షోభం నుంచి బయటపడాలంటే కమలంతో పొత్తు తప్పదని డిసైడ్ అయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే… కనీసం ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలకు అయినా చెక్ పడుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత రాజ్యసభ ద్వారా ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ ని ఎదురించడానికి అసెంబ్లీలో కేటీఆర్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతారని అంటున్నారు.
కాళేశ్వరంలో అవినీతి, ఛత్తీస్ గఢ్ కరెంట్ కొనుగోళ్ళు, యాదాద్రి, భద్రాద్రిలో అక్రమాలు… ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత… ఈ కేసులు అన్నింటి నుంచీ బయటపడాలంటే బీజేపీతో దోస్తీయే బెటర్ అని brs డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు ఉండరన్నది నిజం చేయాలని గులాబీ పార్టీ చూస్తోంది. ఏం జరుగుతుందో… మరో నాలుగు రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు.