KCR Cabinet meeting : 4న కేసీఆర్ కేబినెట్ భేటీ.. ఇదేం షాక్‌.. ఇంత కాన్ఫిడెన్సా..!

తెలంగాణలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటలు.. ఇంకొన్ని గంటలు అంతే.. నెక్ట్స్ అధికారం ఎవరిది అని తెలియడానికి! ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌ దే అధికారం అంటున్నాయి. కారు పార్టీ నేతలు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఐనా సరే కాంగ్రెస్‌కే పట్టం అనుకుంటున్న సమయంలో.. కేసీఆర్ ఇచ్చిన ట్విస్ట్‌తో పొలిటికల్‌ వర్గాలకు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయినట్లు కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2023 | 03:55 PMLast Updated on: Dec 01, 2023 | 3:55 PM

Kcr Cabinet Meeting On 4 This Is A Shock So Much Confidence

తెలంగాణలో పోలింగ్ ముగిసింది. కౌంటింగ్‌ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. కొన్ని గంటలు.. ఇంకొన్ని గంటలు అంతే.. నెక్ట్స్ అధికారం ఎవరిది అని తెలియడానికి! ఎగ్జిట్‌ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌ దే అధికారం అంటున్నాయి. కారు పార్టీ నేతలు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. ఐనా సరే కాంగ్రెస్‌కే పట్టం అనుకుంటున్న సమయంలో.. కేసీఆర్ ఇచ్చిన ట్విస్ట్‌తో పొలిటికల్‌ వర్గాలకు దిమ్మతిరిగి మైండ్‌బ్లాంక్ అయినట్లు కనిపిస్తోంది. ఈ నెల 4వ తేదీన మంత్రులతో భేటీ కాబోతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఎన్నికల ఫలితాలు రాకముందే కేసీఆర్ ఇలాంటి సంచలన ప్రకటం చేయడంపై రాష్ట్ర జకీయాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నట్లు కేసీఆర్ పరోక్షంగా ప్రకటన చేసినట్లు కనిపిస్తుంది.

YS Jagan : ఆంధ్రలోనూ మార్పు తప్పదా ?

కేసీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సహం రెట్టింపు అయింది. అధికారంలోకి వచ్చేది తామే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఆందోళన నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కేసీఆర్‌ కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేయడంపై ఇది అత్యాశ లేక అతి నమ్మకమా..? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇన్ని రోజులు సచివాలయం వైపు కూడా చూడని కేసీఆర్‌.. ఎన్నికల ఫలితాలు రాకముందే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. ప్రగతిభవన్‌ లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏమైనా కేసీఆర్‌ ఆలోచనలను అందుకోవడం అంత ఈజీ కాదు. ఫలితాలు రావడానికి ముందే కేబినెట్ భేటీ అంటున్నారంటే.. ఇంత కాన్ఫిడెన్స్‌ సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.