KCR: కేసీఆర్‌ ఆస్తులు ఎన్ని..? ఎన్నికల అఫిడవిట్‌లో ఏముందంటే..

నామినేషన్‌ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయ్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల 96వేల క్యాష్‌ మాత్రమే ఉందని చెప్పారు కేసీఆర్‌.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2023 | 05:10 PMLast Updated on: Nov 09, 2023 | 5:10 PM

Kcr Files Nomination In Gajwel Assembly Constituency Here Is The Details Of Assets

KCR: బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌.. ఇవాళ గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా గజ్వేల్‌లో ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఛాంబర్‌లో రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుని హెలికాఫ్టర్‌లో కామారెడ్డికి చేరుకున్నారు. అక్కడ ముందుగా బీఆర్‌ఎస్‌ నేతలతో చర్చలు జరిపారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేశారు.

REVANTH REDDY: కాంగ్రెస్ నేతలపైనే ఐటీ దాడులా..? బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు జరగవు: రేవంత్ రెడ్డి

నామినేషన్‌ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయ్. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల 96వేల క్యాష్‌ మాత్రమే ఉందని చెప్పారు కేసీఆర్‌. ఆయన సతీమణి శోభమ్మ పేర్లపై బ్యాంకుల్లో డిపాజిట్లు అయిన నగదు రూ.17 కోట్లకు పైగా ఉంది. కేసీఆర్ పేరు మీద మొత్తం తొమ్మిది బ్యాంక్ అకౌంట్స్, శోభమ్మకు మూడు అకౌంట్స్ ఉన్నాయ్. గత ఐదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్‌ అయ్యాయ్. 2018 ఎన్నికల సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ కలిపి రూ.5కోట్ల 63 లక్షలు ఉండగా.. ఇప్పుడు అది రూ.11 కోట్ల 16 లక్షలకు చేరింది. శోభమ్మ చేతిలో 2018 ఎన్నికల సమయంలో రూ.94 వేల రూపాయల నగుదు ఉంటే.. ఇప్పుడు రూ.6 కోట్ల 29 లక్షలకు చేరింది. బంగారు ఆభరణాలు 2 కిలోల 8వందల గ్రాములు ఉన్నట్లు అఫిడవిట్‌లో చెప్పారు. పదేళ్లుగా ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని అఫిడవిట్‌లో చూపించారు కేసీఆర్. స్థిరాస్తుల రూపంలో రూ.17 కోట్ల 83 లక్షలు, చరాస్తుల రూపంలో రూ.9 కోట్ల 67లక్షలు కేసీఆర్‌కు ఉన్నాయ్. శోభమ్మ పేరు మీద రూ.7 కోట్ల 78 లక్షల విలువ చేసే చరాస్తులు ఉన్నాయ్.

BRS, KTR : బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. ప్రచార వాహనం నుంచి కింద పడ్డ మంత్రి కేటీఆర్..

ఉమ్మడి ఆస్తిగా రూ.9 కోట్ల 81లక్షల మేర చరాస్తులు ఉన్నాయ్. కేసీఆర్‌ పేరు మీద రూ.17 కోట్ల 27 లక్షల అప్పు.. కుటుంబం పేరు మీద రూ.7 కోట్ల 23 కోట్ల అప్పు ఉంది. కేసీఆర్‌కు సొంతంగా కారు, బైక్‌ లేదు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర వాహనాలు 14 ఉన్నాయ్. వీటి విలువ కోటీ 16 లక్షలుగా ఉన్నాయ్. ఇక తనది రైతు కుటుంబం అని, వ్యవసాయం తన వృత్తి అని చెప్పుకునే కేసీఆర్‌.. తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్‌లో ప్రస్తావించడం హైలైట్‌. కేసీఆర్‌, ఆయన సతీమని శోభమ్మ పేర్ల మీద ప్రత్యేకంగా ఎలాంటి భూములు లేవని అఫిడవిట్‌లో చెప్పారు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా చూపించారు. కేసీఆర్ కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా.. అందులో 53 ఎకరాల సాగుభూములు, 9 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయ్.