REVANTH REDDY: ఇది పీకే స్ట్రాటజీ!? పీకే డైరెక్షన్‌లో నడుస్తున్న కేసీఆర్: రేవంత్ రెడ్డి
ప్రతీ రాష్ట్రంలో ఎన్నికల్లో పీకే ఇలాంటి స్ట్రాటజీలనే ఉపయోగిస్తారంటూ ఆరోపించారు. మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టి దాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని ప్రతిపక్షాలను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారంటూ చెప్పారు.
REVANTH REDDY: దాదాపు రెండు నెలల నుంచి తెలంగాణలో పరిస్థితులు థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. వివాదాస్పద ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మేడిగడ్డ కుంగడం, కొత్త ప్రభాకర్‌పై దాడి, రీసెంట్‌గా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీద దాడి.. ఇలా వరుస ఘటనలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. వీటన్నింటి వెనక కాంగ్రెస్ (congress) హస్తం ఉంది అనేది బీఆర్‌ఎస్ ఆరోపణ. ముందునుంచీ ఈ వాదనను వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
ROHIT SHARMA: ఓపెనర్‌గా 14 వేలకుపైగా రన్స్.. రోహిత్ శర్మ మరో రికార్డు
ఇవాళ గువ్వల బాలరాజు మీద ఎటాక్ ఎపిసోడ్ తరువాత బీఆర్‌ఎస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy). ఇవన్నీ ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటూ చెప్పకొచ్చారు. ప్రతీ రాష్ట్రంలో ఎన్నికల్లో పీకే ఇలాంటి స్ట్రాటజీలనే ఉపయోగిస్తారంటూ ఆరోపించారు. మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టి దాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారని ప్రతిపక్షాలను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారంటూ చెప్పారు. చివరికి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్‌తో అసలు విషయం బయటికి వచ్చిందని చెప్పారు. ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి వెనక కూడా కాంగ్రెస్ ఉందంటూ తమను దోషులుగా చూపే ప్రయత్నం చేశారన్నారు. కానీ ఈ దాడి వెనక కుట్ర లేదని తేలిందన్నారు.
ఇప్పుడు గువ్వల బాలరాజు మీద దాడి వ్యవహారం కూడా కాంగ్రెస్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బాలరాజు డబ్బుల కట్టలతో వెళుతుంటే అడ్డుకున్నందుకు కాంగ్రెస్ నేతల మీదే దాడి చేశాడని ఆరోపించారు. బాలరాజు ప్రవర్తన ఎలా ఉంటుందో తెలంగాణ సమాజానికి తెలుసని చెప్పారు. రీసెంట్‌గా ఓ ఫేక్ లెటర్ పట్టుకుని కేటీఆర్ నానా హంగామా చేశారని చెప్పారు. ఫాక్స్‌కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించాలని డీకే శివకుమార్ లేఖ రాశారనేది అవాస్తవమని చెప్పారు. ఇవన్నీ కేసీ స్ట్రాటజీలో భాగమని.. ప్రతిపక్షాలపై బురద జల్లేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని చేసినా మరోసారి బీఆర్‌ఎస్‌ను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధగా లేరంటూ చెప్పారు. ఎన్ని డ్రామాలు వేసినా తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాగ్రెస్సే అని చెప్పారు రేవంత్ రెడ్డి.