KCR is back : కేసీఆర్ ఈజ్ బ్యాక్.. ఇక పూర్తిగా జనంలోనే..
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడం ఆ పార్టీ నాయకుల్లో ఎంతటి అధైర్యాన్ని నింపిందో.. కేసీఆర్ ప్రమాదానికి గురికావడం కూడా అంతే భయాన్ని నింపింది. ఓ పక్క చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్నటి వరకూ రాజకీయ శతృవులుగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు అధికారంలో మంత్రులుగా ఉన్నారు. మరో పక్క అండగా ఉంటాడు అనుకున్న నాయకుడు మంచాన పడ్డాడు. కేటీఆర్, హరీష్ రావు ఫీల్డ్‌లో ఉన్నా.. కేసీఆర్ కనిపిస్తే ఆ పార్టీ నేతల్లో వచ్చే జోష్ వేరు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోవడం ఆ పార్టీ నాయకుల్లో ఎంతటి అధైర్యాన్ని నింపిందో.. కేసీఆర్ ప్రమాదానికి గురికావడం కూడా అంతే భయాన్ని నింపింది. ఓ పక్క చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్నటి వరకూ రాజకీయ శతృవులుగా ఉన్నవాళ్లంతా ఇప్పుడు అధికారంలో మంత్రులుగా ఉన్నారు. మరో పక్క అండగా ఉంటాడు అనుకున్న నాయకుడు మంచాన పడ్డాడు. కేటీఆర్, హరీష్ రావు ఫీల్డ్‌లో ఉన్నా.. కేసీఆర్ కనిపిస్తే ఆ పార్టీ నేతల్లో వచ్చే జోష్ వేరు. కానీ సార్ బయటికి రాలేని పరిస్థితి. ఫాం హౌజ్‌లో ప్రమాదానికి గురై.. దాదాపు నెల రోజుల నుంచి మంచానికే పరితమయ్యారు కేసీఆర్. కానీ ఇప్పుడు పార్టీ నేతల్లో ధైర్యాన్ని నింపుకునేందుకు.. తెలంగాణలో మరోసారి పట్టు సాధించేందుకు కేసీఆర్ బయటికి వస్తున్నారు. త్వరలోనే ఆయన తెలంగాణ వ్యాప్తంగా పర్యటించబోతున్నారు.
ఒకటి రెండు కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మీటింగ్‌లు నిర్వహించబోతున్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకుని చైర్‌లో కూర్చున్న ఫొటోను.. లీడర్ ఈజ్ బ్యాక్ అంటే ఎంపీ సంతోష్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. త్వరలోనే ఆయన ప్రజల మధ్యకు మరోసారి రాబోతున్నారంటూ చెప్పారు. దీంతో పార్టీ నేతల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణలో అధికారాన్ని కోల్పోవడం, కేసీఆర్ ప్రమాదానికి గురి కావడంతో బీఆర్‌ఎస్ నేతల్లో చాలా వరకూ జోష్ తగ్గింది. రాష్ట్రంలో దాదాపు అంతా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లందరినీ యాక్టివేట్ చేసేందుకు కేసీఆర్ మళ్లీ బయటికి వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం మొదలు పెట్టబోతున్నారు.
గెలుపు గుర్రాలను బరిలో దింపి.. తెలంగాణలో పట్టుకోల్పోకుండా ఉండేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఉన్న కారణాల్లో అతిపెద్ద కారణం కేసీఆర్ ప్రజల్లోకి రాడు అని. ఇప్పుడు ఆ అపవాదునున వదిలించుకునే పనిలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో మీటింగ్‌లు పెడుతూ ఇప్పటి నుంచీ కేసీఆర్ ప్రజల్లోనే ఉండబోతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పావులు కదపబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన తెలంగాణ ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.