REVANTH REDDY: కేసీఆర్‌తో ప్రమాదమేనా? కాంగ్రెస్ సర్కార్ ఐదేళ్లు పాలించగలదా..?
కాంగ్రెస్ ఐదేళ్లు పరిపాలించగలదా.. లేదంటే మధ్యలోనే కూలిపోయే అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్. దీనికి కారణం కూడా లేకపోలేదు. బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలతో ఇలాంటి అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయ్.
REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సచివాలయంలో ఫస్ట్ కేబినెట్ భేటీ కూడా నిర్వహించారు. ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం, ప్రగతిభవన్ గేట్లు బద్దలు చేయడం.. ఇది ప్రజాప్రభుత్వం అని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. ఇదంతా ఎలా ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్‌తో, బీఆర్ఎస్‌తో ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. మొదటిసారి బీఆర్ఎస్సేతర ప్రభుత్వం ఏర్పాటు అవుతుండడంతో కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతుంది..? హామీలను ఎంతవరకు నెరవేర్చుతారు అనే క్యూరియాసిటీ అందరిలోనూ కనిపిస్తోంది.
REVANTH REDDY: కేసీఆర్ మీద రేవంత్ రివేంజ్ తీర్చుకుంటారా..?
ఇదే సమయంలో కాంగ్రెస్ ఐదేళ్లు పరిపాలించగలదా.. లేదంటే మధ్యలోనే కూలిపోయే అవకాశం ఉందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్. దీనికి కారణం కూడా లేకపోలేదు. బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలతో ఇలాంటి అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపు కూలిపోతుందంటూ కడియం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయ్. కడియం మాటలకు అర్థం ఏంటి.. కాంగ్రెస్‌లో కారు పార్టీ కోవర్టులు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయింది. హ్యాట్రిక్ విజయం అందుకోవాలన్న కారు పార్టీ నేతల కల నెరవేరలేదు. దీంతో కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టారు. సమయం చూసి వాటిని అమలు చేస్తారా.. అదే జరిగితే పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
7 సీట్లు సాధించిన మజ్లిస్ మద్దతు ఎలాగూ ఉంటుంది. అధికారం దక్కాలంటే మరో 21మంది మద్దతు అవసరం. మిగిలిన 14మంది ఎమ్మెల్యేలను రాబట్టుకుంటే మళ్లీ అధికారం దక్కించుకోవచ్చు. కడియం శ్రీహరి మాటలు ఇప్పుడు ఇదే చెప్తున్నాయా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఐతే ఇది అనుకున్నంత ఈజీ కాదు. అంచనా వేసినంత సులభం కాదు. ఏమైనా తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారబోతుంది అన్నది మాత్రం క్లియర్‌గా కనిపిస్తోంది.