Amit Shah: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలు.. బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ: కేంద్ర మంత్రి అమిత్ షా
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలు. బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మోదీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం.
Amit Shah: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలని, బీజేపీ ఒక్కటే తెలంగాణ ప్రజల పార్టీ అని విమర్శించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సోమవారం జనగామలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. “వల్లభ్‌భాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి రాష్ట్రం విముక్తి పొందింది. ఓవైసీకి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవాలు జరపలేదు. బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుతాం.
Pawan kalyan: ఓజీలో పవన్ క్యారెక్టర్‌పై ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
భైరాన్‌పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్థూపం నిర్మిస్తాం. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలు. బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. మోదీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది. అవినీతిలో కేసీఆర్ పాలన అగ్ర స్థానంలో ఉంది. కాళేశ్వరం కుంభకోణం.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొత్తం కుంభకోణాలమయమే. రాజ్యాంగ విరుద్ధమైన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. ఫసల్ భీమా అమలు చేస్తాం. పేదలకు వైద్య సాయం కోసం రూ.10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌తోనే తెలంగాణ విముక్తమైంది. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదు. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైంది. అవీనితికి పాల్పడిన వారిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరిగింది. బీజేపీ అధికారంలోకి రాగానే వరికి రూ.3100 మద్దతు ధర ఇస్తాం. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తోంది. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు 2జీ, 3జీ, 4జీ పార్టీలు. బీఆర్ఎస్ 2జీ పార్టీ అని.. అంటే కేసీఆర్, కేటీఆర్‌లపార్టీ. మూడు తరాలుగా వారసత్వ రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం 3జీ పార్టీ. కాంగ్రెస్‌లో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాబట్టి అది 4జీ పార్టీ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా సెప్టెంబర్ 17న విమోచన దినం నిర్వహిస్తాం” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.