BRS POTHULU : పొత్తుల కోసం కేసీఆర్ వెంపర్లాట.. కమ్యూనిస్టులకు మళ్ళీ ఆఫర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) BRS ను ఓడగొట్టడంతో కారు షెడ్డుకు వెళ్ళిపోయింది. అందుకే కొత్త ఫ్రెండ్స్ ని వెతుక్కొని ఆ కారును మళ్లీ జనంలోకి తేవాలని గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు BSP ఉనికినే పట్టించుకోలేదు. అలాంటిది ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులకు కూడా రాయబారం పంపుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) BRS ను ఓడగొట్టడంతో కారు షెడ్డుకు వెళ్ళిపోయింది. అందుకే కొత్త ఫ్రెండ్స్ ని వెతుక్కొని ఆ కారును మళ్లీ జనంలోకి తేవాలని గులాబీ బాస్ కేసీఆర్ (KCR) ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు BSP ఉనికినే పట్టించుకోలేదు. అలాంటిది ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులకు కూడా రాయబారం పంపుతున్నారు.
ఒకప్పుడు తోక పార్టీలు… అసలు వాటిని పట్టుంచుకోవద్దంటూ కమ్యూనిస్టులను కూరలో కరివేపాకులా తీసి పారేశారు మాజీ సీఎం కేసీఆర్. కానీ మునుగోడు ఉపఎన్నికల్లో (by-election) వాళ్ళ అవసరం రావడంతో… స్టేజీ మీద కూర్చొబెట్టుకొని లేని పోని ప్రేమను ఒలకబోశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు కమ్యూనిస్టు పార్టీలను మళ్ళీ పట్టించుకోలేదు. తెలంగాణ జనం అధికారం నుంచి దించేయడంతో… లోక్ సభ ఎన్నికల్లో గట్టెక్కడమే కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఎవరు దొరుకుతారా… ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు కేసీఆర్. ఆయన నియంతృత్వపు పోకడలు నచ్చక సర్కారీ కొలువుకు రిజైన్ చేసి… బీఎస్పీ (BSP) లో చేరిన ప్రవీణ్ కుమార్ (RS Praveena Kumar) ను అప్పట్లో బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈమధ్య పిలిచి నాగర్ కర్నూల్ లో మద్దతిస్తామని ప్రామిస్ చేసి… రాష్ట్రంలో ఉనికే లేని BSPతో పొత్తు పెట్టుకున్నారు కేసీఆర్.
ఇప్పుడు లేటెస్ట్ గా కమ్యూనిస్టులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుల కోసం ప్రయత్నించి విఫలమైన సీపీఎం సొంతంగా పోటీ చేసి బొక్క బోర్లా పడింది. సీపీఐ తెలివిగా వ్యవహరించడంతో కొత్తగూడెం అసెంబ్లీ సీటును కాంగ్రెస్ సాయంతో గెలుచుకుంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ ఎక్కడో ఒక చోట అవకాశం ఇవ్వకపోతుందా అని సీపీఐ, సీపీఎం పార్టీలు ఎదురు చూస్తున్నాయి. కానీ హస్తం పెద్దల నుంచి అలాంటి సిగ్నల్స్ ఏవీ లేవు. మేం ఇండియా కూటమిలో ఉన్నా మమ్మల్ని తెలంగాణలో ఎందుకు పట్టించుకోవట్లేదని ఫైర్ అవుతున్నారు లెఫ్ట్ పార్టీల లీడర్లు. చెరో సీటు ఇచ్చినా సర్దుకుపోతాం అని సంకేతాలు పంపుతున్నా… కాంగ్రెస్ (Congress) డోంట్ కేర్ అంటోంది. పైగా ఈమధ్య కేరళ వెళ్ళొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) … ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ పై విమర్శలు చేశారు.
గతంలో విజయన్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు కేసీఆర్ ని కలవడాన్ని రేవంత్ తప్పుబట్టారు. కేసీఆర్ లాగే విజయన్ కూడా అవినీతిపరుడని విమర్శించారు. ఈ కామెంట్స్ తో రేవంత్ పై సీపీఎం (CPM) నేతలు ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ పట్టించుకోకపోవడంతో… ఇక కారు పార్టీతో ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల నేతల మధ్య ప్రాథమికంగా చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. కేసీఆర్ చెరొక సీటైనా ఇస్తారని ఆశలు పెట్టుకున్నాయి ఆ రెండు కమ్యూనిస్ట్ పార్టీలు.