KCR: ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకొన్నా: కేసీఆర్

గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16 వరకు మన ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకొన్నా. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం నిర్వహిస్తాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2023 | 08:44 PMLast Updated on: Dec 04, 2023 | 8:44 PM

Kcr Latest Comments With Brs Leaders After Defeat

KCR: వచ్చే నెల వరకు తన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల తీర్పు నేపథ్యంలో హుందాగా తప్పుకొన్నట్లు చెప్పారు మాజీ సీఎం కేసీఆర్. సోమవారం ఆయన తన ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16 వరకు మన ప్రభుత్వమే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకొన్నా. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం.

CONGRESS: కాంగ్రెస్‌లో అలజడి.. సీఎం పదవి కోసం సీనియర్ల మధ్య వాగ్వాదం!?

త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం నిర్వహిస్తాం. ఫలితాలపై సమీక్ష చేద్దాం. త్వరలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుందాం” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలు గంగులు, మల్లారెడ్డి, పోచారం, దానం, తలసాని, వివేకానంద, సత్యవతి రాథోడ్, హరీష్ రావు, పల్లా సహా ఎమ్మెల్సీలు హాజరయ్యారు.