KCR press meet : నేడు తెలంగాణ భవన్లో KCR ప్రెస్ మీట్
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) పోలింగ్ కు సమయం దగ్గర పడింది. నేడు ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి BRS పార్టీ (BRS Party) అధినేత KCR ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

KCR press meet at Telangana Bhavan today
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) పోలింగ్ కు సమయం దగ్గర పడింది. నేడు ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి BRS పార్టీ (BRS Party) అధినేత KCR ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనే దానిపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు సమాచారం.
‘బస్సు యాత్ర ద్వారా ఆయన ఏం తెలుసుకున్నారు? ప్రజల మూడ్ ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఎంత ఉంది?’ అనే ప్రశ్నలన్నింటికీ ఆయన ప్రెస్మీట్లో సమాధానం చెప్పబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది.