Balagam: బలగం మొగిలయ్యకు దళితబంధు.. ప్రభుత్వం ఏం ఇచ్చిందో తెలుసా?

బలగం సినిమా ఒగ్గుకథ కళాకారుడు మొగిలయ్యకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మొగిలయ్యకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు దళితబంధు పథకం మంజూరు చేసింది. కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తన పాట ద్వారా తెలిపిన వ్యక్తి బలగం మొగిలయ్య. బలగం సినిమాలో ఈయన పాడిన పాటకు కన్నీరు పెట్టుకోనివాళ్లు లేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 18, 2023 | 03:54 PMLast Updated on: May 18, 2023 | 3:54 PM

Kcr React About Balagam Mogilaiah

సినిమా మొత్తానికి ఈ పాటే ప్రాణమా అన్నట్టు తమ ప్రాణం పెట్టి పాటపాడాలు మొగిలయ్య దంపతులు. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా బధం విలువతో మొగిలయ్య జీవితాన్ని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. నిజజీవితంలో మొగిలయ్య కుటుంబం అనుభవిస్తున్న కష్టాలు అందరీకీ తెలిసేలా చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా దుగ్గొండికి చెందిన బుడిగ జంగాల కళాకారుడు పస్తం మొగిలయ్య- కొమురమ్మ దంపతులు అనారోగ్య కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. మొగిలయ్యకు రెండు కిడ్నీలు పాడైపోయాయి. రెగ్యేలర్‌గా డయాలసిస్‌ చేయించకపోతే ఆయన బతకరు.

బలగం సినిమాతో మొగిలయ్య టాలెంట్‌తో పాటు తనకున్న జబ్బుకూడా బయటి ప్రపంచానికి తెలిసింది. మొగిలయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పందించి చికిత్స కోసం మొగిలయ్యను హస్పిటల్‌లో చేర్పించారు. కానీ అప్పటికే ఆరోగ్యం విషమంగా మారింది. మంచి వైద్యం చేయించునేందుకు మొగిలయ్య దంపతుల దగ్గర డబ్బు లేకపోవడంతో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన కేసీఆర్‌ మొగిలయ్యను హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి చేర్పించి మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్య కుటుంబానికి అండగా నిలిచింది. దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకంలో మొగిలయ్యను ఎంపిక చేశారు. పథకంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌ మొగిలయ్యకు కారు అందించారు.