KCR request BJP : పార్టీ కలిపేస్తాం… కవితను వదిలేయండి… బీజేపీని వేడుకుంటున్న కేటీఆర్, హరీశ్

BRSను కలిపేస్తాం... కవితను వదిలేయండి... ఇది ఇప్పుడు బీజేపీ ముందు కేసీఆర్ పెట్టిన రిక్వెస్ట్. ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు జీవితం 100 రోజులు దాటాయి. 15 రోజులకో... నెలకో బయటకు వస్తుందిలే అని ధీమాగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి చుక్కలు కనిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 9, 2024 | 04:35 PMLast Updated on: Jul 09, 2024 | 4:35 PM

Kcr Request Bjp

BRSను కలిపేస్తాం… కవితను వదిలేయండి… ఇది ఇప్పుడు బీజేపీ ముందు కేసీఆర్ పెట్టిన రిక్వెస్ట్. ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు జీవితం 100 రోజులు దాటాయి. 15 రోజులకో… నెలకో బయటకు వస్తుందిలే అని ధీమాగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఓ వైపు అధికారం కోల్పోవడం మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా BRSని వీడి పోతుండటం… కవిత ఇంకా జైల్లోనే ఉండటంతో గులాబీ బాస్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎలాగైనా కవితను తీహార్ జైలు నుంచి బయటకు తీసుకురావాలని కేటీఆర్, హరీశ్ రావు… ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం పెట్టారు. బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.
తెలంగాణలో BRS అధికారంలో ఉన్నన్ని రోజులూ… మోడీని పీకేస్తా… ఢిల్లీలో నేనే చక్రం తిప్పుతా… అవసరమైతే ప్రధానమంత్రి కూడా అవుతా అంటూ బీరాలు పలికారు కేసీఆర్. కానీ అధికారం కోల్పోవడం… కవిత ఎంతకూ బయటకు రాకపోవడంతో ఇప్పుడు బీజేపీతో కాళ్ళ బేరానికి సిద్ధమయ్యారు. కవితను లిక్కర్ కేసు నుంచి తప్పించడానికి కేసీఆర్ ఫ్యామిలీ విశ్వప్రయత్నం చేస్తోంది. గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు. కవితను ఓసారి ములాఖత్ లో కలిసొచ్చారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేతలను కలుసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ చోటా మోటా లీడర్లు తప్ప.. బీజేపీ అగ్రనేతలెవరూ వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా అపాయింట్మెంట్ కోసం కేటీఆర్, హరీష్ బృందం పడిగాపులు పడుతున్నాయి. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని BRS నేతలు వేడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏం కావాలన్నా సహకరిస్తామని ప్రపోజల్ పెట్టారు. అంతేకాదు… వచ్చే GHMC, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకుంటామని కూడా బీజేపీకి BRS ఆఫర్ ఇచ్చింది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం… BRSను తమ పార్టీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. దాంతో బీఆర్ఎస్ నేతలు డైలమాలో పడ్డారు. పార్టీని విలీనం చేయడం సాధ్యం కాదు గానీ… అన్ని రకాలుగా బీజేపీకి సహకారం అందిస్తామని వేడుకుంటున్నారు. గత నెల రోజుల నుంచి మూడు విడతలుగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్స్ కోసం కేటీఆర్, హరీష్ రావు తిరుగుతూనే ఉన్నారు. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పిస్తే పార్టీ విలీనం తప్ప… దేనికైనా సిద్ధమంటూ ఢిల్లీ బీజేపీ అగ్రనేతలకు BRS సమాచారం పంపింది. కానీ పార్టీ విలీనం కోసమే బీజేపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. కవితను బయటకు తీసుకురావడానికి ఓ వైపు న్యాయస్థానంలో పోరాడుతూనే… మరోవైపు బీజేపీతో రాజీకి విశ్వప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్, హరీశ్ రావు.