KCR: కవిత అరెస్టు అక్రమం.. తొలిసారి స్పందించిన కేసీఆర్..
తొలిసారి కవిత అరెస్టుపై స్పందించారు. కవిత తప్పు చేసినట్టుగా సీబీఐ ఆధారాలు చూపించలేదన్నారు. బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టినందుకే కవితను జైలుకి పంపించారంటూ కేసీఆర్ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
KCR: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంశంలో కేసీఆర్ స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమే అన్నారు. హైదరాబాద్, తెలంగాణ భవన్‌లో కేసీఆర్.. తన పార్టీ నాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రపై నేతలతో చర్చించారు. పార్టీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థులకు బీఫాం, రూ.95 లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా తొలిసారి కవిత అరెస్టుపై స్పందించారు. కవిత తప్పు చేసినట్టుగా సీబీఐ ఆధారాలు చూపించలేదన్నారు.
ELECTION NOMINATIONS: మొదలైన నామినేషన్ల పర్వం.. తొలిరోజు నామినేషన్ దాఖలు చేసింది వీళ్లే
బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టినందుకే కవితను జైలుకి పంపించారంటూ కేసీఆర్ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలపై కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. రాబోయే రోజులు ముమ్మాటికీ బీఆర్ఎస్‌వే. వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తాం. పార్లమెంట్‌లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉంది. 104 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారు. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బతకనిస్తారా..? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లినవాళ్లు ఇప్పుడు బాధపడుతున్నారు. కాంగ్రెస్‌లో అంతా బీజేపీ కథ నడుస్తోందని ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత బాధపడ్డారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా అని అడిగాడు. కానీ, నేనే వద్దని చెప్పా. ఉద్యమ కాలంనాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు.
రానున్న రోజులు మనవే. బస్సు యాత్ర రూట్ మ్యాప్ కూడా ఇవాళ ఖరారు చేస్తాం. ఈ నెల 27 నుంచి రోడ్డు షోలో ప్రారంభిస్తాం. వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం సెంటర్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ స్థానాల్లో రోడ్డు షోలు ఏర్పాటు చేస్తాం. ఉదయం రైతుల దగ్గరికి పోదాం. ప్రతి రోజు.. రెండు లేదా మూడు రోడ్డు షోలు చేద్దాం. సాయత్రం రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్‌లు పెడతాం” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.