KCR SPEECH : రేవంత్ పెద్ద భుకాబ్జాదారుడు… కొడంగల్ లో లాగు ఊడే దాక కొట్టండి : కేసీఆర్

రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించిన కేసీఆర్... ఆయనపై విమర్శల దాడికి దిగారు. రేవంత్ లాగు ఊడే దాకా కొట్టాలని జనానికి పిలుపు ఇచ్చారు. ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ని ఓడించాలని పిలుపు ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 22, 2023 | 06:13 PMLast Updated on: Nov 22, 2023 | 6:13 PM

Kcr Speech On Revanth Reddy At Kodangal

KCR Praja Asweeradha Yatra: రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో అంగి ఊడేదాకా కొడతారు.. కొడంగల్ లో లాగు ఊడే దాక కొట్టండని పిలుపు ఇచ్చారు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్. కొడంగల్ నియోజక వర్గం కోస్గిలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ పెద్ద భుకాబ్జాదారుడు అని కేసీఆర్ మండిపడ్డారు. ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదు. పని చేసే నరేందర్ రెడ్డి కావాలా.. ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ కావాలా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి అది తనకు మెడల్ అంటున్నాడని విమర్శించారు కేసీఆర్. కాంగ్రెస్ లో 15 మంది మోపయిర్రు.. సీఎం నేను అంటే సీఎం అంటున్నారు. ప్రజల మధ్యన ఉండే వాళ్ళకి ఓటు వేస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు కేసీఆర్. నరేందర్ రెడ్డిని గెలిపియండి, ఆయనకు ప్రమోషన్ వస్తదని అన్నారు. కొడంగల్ కు ఒక రోజు వచ్చి రోజంతా ఉంటా.. ఎన్ని కోట్ల నిధులైనా ఇస్తానని తెలిపారు. అభివృద్ధి బాధ్యత తనదే అన్నారు సీఎం కేసీఆర్. ఏడాది లోపల పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీరు అందుతదని చెప్పారు.

బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమనీ… 15 యేళ్ళు పోరాడి తెలంగాణ సాధించిందని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ అన్నారు. రైతు బీమాతో ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతు బంధుకు డబ్బులిచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 24 గంటల కరెంట్ వేస్ట్.. మూడు గంటల కరెంట్ చాలు అని.. రైతు 10 HP మోటార్ పెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని అన్నారు. 10 HP మోటార్ లు పెట్టాలి అంటే 50 వేల కోట్లు కావాలని సీఎం కేసీఆర్ వివరించారు.
కాంగ్రెస్ వస్తే ధరణి తీసేసి.. భూమాత పెడతారట… భూమాతనా… భూమేతనా అని ఎద్దేవా చేశారు. ధరణి తీసేస్తే రైతు బందు ఎలా వస్తుంది. మళ్ళా వీఆర్ఏ, వీఆర్ఓలను తీసుకొస్తామని అంటున్నారు.. అది మనకు అవసరమా అని కేసీఆర్ అన్నారు. ఇంతకు ముందు మంచి నీటికి గోస ఉండేది, కానీ నేడు అది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కంటి వెలుగు అనేది దేశంలో ఎవరైనా చేశారా… మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు.