BRS Maharashtra : అద్దెలు ఎగ్గొట్టిన కేసీఆర్… వారం డెడ్ లైన్ పెట్టిన BRS లీడర్లు

తెలంగాణలో ఓటమితో BRS పార్టీ బేస్ కోల్పోయింది. బేస్మెంట్ సరిగా లేకపోతే... ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఏం లాభం అనుకున్నారో ఏమో... ఒక్కో రాష్ట్రంలో గులాబీల దుకాణాలను కట్టేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఇప్పటికే ఒడిశాలో BRS నేతలు కాంగ్రెస్ (Congress) లో చేరిపోవడంతో... అక్కడ పార్టీ పడుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరు వైసీపీలో చేరారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2024 | 02:14 PMLast Updated on: Mar 07, 2024 | 2:16 PM

Kcr Who Missed The Rent Brs Leaders Set A Deadline Of A Week

తెలంగాణలో ఓటమితో BRS పార్టీ బేస్ కోల్పోయింది. బేస్మెంట్ సరిగా లేకపోతే… ఇతర రాష్ట్రాల్లో విస్తరించి ఏం లాభం అనుకున్నారో ఏమో… ఒక్కో రాష్ట్రంలో గులాబీల దుకాణాలను కట్టేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఇప్పటికే ఒడిశాలో BRS నేతలు కాంగ్రెస్ (Congress) లో చేరిపోవడంతో… అక్కడ పార్టీ పడుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇద్దరు నేతల్లో ఒకరు వైసీపీలో చేరారు. ఇంకొకరు పార్టీ అధ్యక్షడు చంద్రశేఖర్ జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ కారు దిగిపోడానికి లీడర్లంతా రెడీ అయ్యారు.

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆఫీసులకు అద్దె కట్టడం లేదు మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్… కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మిగతా బీఆర్ఎస్ లీడర్లు కూడా ఫోన్ చేస్తే సమాధానం లేదు. పార్టీలో ఉండాలా… పోవాలా అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు మహారాష్ట్ర (Maharashtra BRS) BRS లీడర్లు. కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసుల అద్దెలు కట్టకపోగా… ఇక్కడ పార్టీ కార్యక్రమాలకు నిధులు కూడా ఇవ్వట్లేదని లీడర్లు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేస్తామంటూ… కొందరు NCP, కాంగ్రెస్‌ నేతలను చేర్చుకున్నారు BRS చీఫ్ కేసీఆర్ (KCR). తెలంగాణ మంత్రులు, BRS లీడర్లు… అందర్నీ ఏసుకొని పెద్ద కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్ళి హడావిడి చేశారు.

తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో ప్రతి రోజూ సాయంత్రం మీటింగ్ పెట్టి… చిన్నా చితకా లీడర్లకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఇప్పుడేమైంది. ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదని నిలదీస్తున్నారు మహారాష్ట్ర గులాబీ లీడర్లు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆరుగురు కోర్దినేటర్లు కలసి మీటింగ్ పెట్టారు.

మహారాష్ట్రలో పోటీ చేస్తారా లేదా తేల్చాలంటూ డిమాండ్ చేస్తూ ఘాటైన లెటర్ రాశారు. బీఆర్ఎస్ లో చేరి తమ రాష్ట్రానికి ద్రోహులం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం ఉందా లేదా… వారం రోజుల్లో తేల్చి చెప్పాలంటూ కేసీఆర్ కు లెటర్ రాశారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ వైఖరితో… రాబోయే ఎన్నికల్లో ఏం చేయాలో తెలియడం లేదని లబోదిబో మంటున్నారు.