KCR: కామారెడ్డిలో కేసీఆర్‌కు ఓటమి తప్పదా.. ఎగ్జిట్ పోల్ ఫలితం ఇదే..!
గజ్వేల్ సంగతి పక్కన పెడితే కామారెడ్డి గురించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయే చాన్స్ ఉందని ఆరా ముస్తాన్ అనే సర్వే సంస్థ సంచలన ఎగ్జిట్‌పోల్ రిలీజ్ చేసింది.
KCR: తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి స్థానాలు అత్యంత ఆసక్తిగా మారాయి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత మొదటి సారి కేసీఆర్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ నుంచే కాకుండా.. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు. ఓటమి భయంతో కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. ఇక బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఇద్దరూ కేసీఆర్ మీద పోటీ చేశారు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తే.. గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద పోటీ చేశారు.
Exit Polls: రాజస్థాన్‌లో కమలం.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ – బీజేపీ నువ్వా నేనా..?
గజ్వేల్ సంగతి పక్కన పెడితే కామారెడ్డి గురించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయే చాన్స్ ఉందని ఆరా ముస్తాన్ అనే సర్వే సంస్థ సంచలన ఎగ్జిట్‌పోల్ రిలీజ్ చేసింది. కేసీఆర్‌తో పాటు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఓడిపోయే చాన్స్ ఉందని చెప్పింది. కామారెడ్డి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారంటూ ఆరా ముస్తాన్ సర్వే సంస్థ ప్రకటించింది. కొంత కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒక కారణమైతే.. భారీ స్థాయిలో ఓట్ బ్యాంక్ చీలిపోవడం కేసీఆర్ ఓటమికి కారణమయ్యే అంశాలని ఆరా సంస్థ ప్రకటించింది. కాంగ్రెస్ పోటీ కారణంగా భారీ స్థాయిలో ఓట్‌బ్యాంక్ చీలిపోనుందని.. అది బీజేపీకి ప్లస్ అవబోతోందని ఆరా సంస్థ అంచనా వేస్తోంది.
ఇక గజ్వేల్‌లో మాత్రం కేసీఆర్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్టు ప్రకటిచింది ఆరా సంస్థ. ఈటెల రాజేందర్ పోటీ ఇస్తున్న గజ్వేల్ నుంచి స్వల్ప మెజార్టీతో కేసీఆర్ గెలవబోతున్నట్టు తెలిపింది. గజ్వేల్ నియోజకవర్గంలో ఈటెల ఓటమి తప్పదంటూ ఆరా సంస్థ ప్రకటించింది. బీఆర్‌ఎస్ మరోసారి తెలంగాణలో అధికారం చేపట్టంబోతోందని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆరా ముస్తాన్ సంస్థ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకపంణలు సృష్టిస్తున్నాయి.