KCR: కేసీఆర్ నయా రూట్.. ఎంపీ అభ్యర్థులకు 95 లక్షలు
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు బీఫాంతోపాటు రూ.95 లక్షల చెక్కు కూడా అందజేయనున్నారు. ఎన్నికల్లో ఖర్చుల కోసం 17 మంది అభ్యర్థులకు ఈ చెక్కులు అందజేస్తారు. గురువారం, ఏప్రిల్ 18 నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
KCR: పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త పంథా అనుసరించబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు బీఫాంతోపాటు రూ.95 లక్షల చెక్కు కూడా అందజేయనున్నారు. ఎన్నికల్లో ఖర్చుల కోసం 17 మంది అభ్యర్థులకు ఈ చెక్కులు అందజేస్తారు. గురువారం, ఏప్రిల్ 18 నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ATTACK ON YS JAGAN: జగన్‌పై దాడి కేసులో నిందితులు వీళ్లే ! పోలీసు విచారణలో సంచలనాలు..
ఈ సందర్భంగా అదే రోజు హైదరాబాద్, బీఆర్ఎస్ భవన్‌లో పార్టీ అభ్యర్థులు, కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తాజా రాజకీయాలపై సమావేశంలో చర్చిస్తారు. అనంతరం అభ్యర్థులకు చెక్కులు అందిస్తారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలకు చేరువ చేసేందుకు బస్సు యాత్రలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్సు యాత్ర ద్వారా రైతుల వద్దకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుంటారు. వారికి భరోసా కల్పిస్తారు. ప్రస్తుత ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు కీలకంగా మారాయి. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నేతలు కూడా దొరకడం లేదు. టిక్కెట్ ఇచ్చిన నేతలు కూడా పార్టీని వీడి వేరే పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దీంతో పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు లేకుండా పోయారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కావడం, ఫోన్ ట్యాపింగ్, మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వంటివి ఆ పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి.
దీంతో అటు ప్రజల్లో.. ఇటు సొంత పార్టీ నేతల్లో బీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి.. లోక్‌సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తేనే బీఆర్ఎస్‌కు కాస్త మైలేజీ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్టుపై కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ అంశాలపై కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.