Sangareddy Kcr Sabha : రేపు సంగారెడ్డిలో కేసీఆర్ భారీ సభ.. లక్ష్య మందితో సభ ఏర్పాటు…?
దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో అధికార – ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సభలు , సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో అధికార – ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సభలు , సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ జన జాతర పేరుతో సభలు నిర్వహిస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ పేరుతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకపడనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చారు.. ఇప్పుడు అడిగితే ప్రజలకు మొండిచేయి చూపిస్తున్నారు.. అంటూ కేసీఆర్ మొన్నటి సభలో విమర్శలు గుప్పించారు.
మాజీ సీఎం కేసీఆర్ రేపు సంగారెడ్డి జిల్లాలో భారీ సభ నిర్వహించనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా సుల్తాన్ పూర్ లోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభ లో కేసీఆర్ పాల్గొని లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు కృషిచేయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేయ్యనున్నారు. కాగా ఈ సభ కు సుమారుగా లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, నర్సాపుర్, నారాయణఖేడ్, పటాన్ చెరు, నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరుకానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు ఎక్కవ సంఖ్యల్లో యువత, రైతులు, మహిళలు హాజరయ్యేలా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేపడుతున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. కాగా మెదక్ నుంచి BRS అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.