KCR: కేసీఆర్ లేకుండానే మీటింగ్.. ఖాళీ కుర్చీని చూసి కేటీఆర్ ఎమోషనల్..
కేటీఆర్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలతో తాజాగా ఓ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చన హామీలపై మండలిలో ప్రశ్నించాలంటూ దిశా నిర్దేశం చేశారు. కానీ ఈ మీటింగ్‌లో ఓ సీన్ ప్రతీ ఒక్క గులాబీ కార్యకర్త మనసును కలచివేసింది.
KCR: 14 ఏళ్ల పోరాటం.. 10 ఏళ్ల ప్రభుత్వం.. ప్రతీ కార్యకర్తకు ఆయనే ధైర్యం. కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉన్నా.. కేసీఆర్ కనిపిస్తే గులాబీ శ్రేణుల్లో వచ్చే ఉత్సాహం.. ఆయన్ని చూస్తే వచ్చే ధైర్యం వేరు. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. కేసీఆర్‌కు ప్రమాదం జరగడం.. వరుస పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు డీలా పడిపోయారు. ఈ క్రమంలోనే పార్టీలో జోష్ నింపేందుకు కేటీఆర్, హరీష్ రావు.. చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Addanki Dayakar: ఆ ఇద్దరే కారణమా..? అద్దంకి దయాకర్‌కి దెబ్బ వేసింది ఆ ఇద్దరేనా..?
ప్రభుత్వంపై పోరాడేందుకు వ్యూహాలు రచిస్తూ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలతో తాజాగా ఓ మీటింగ్ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చన హామీలపై మండలిలో ప్రశ్నించాలంటూ దిశా నిర్దేశం చేశారు. కానీ ఈ మీటింగ్‌లో ఓ సీన్ ప్రతీ ఒక్క గులాబీ కార్యకర్త మనసును కలచివేసింది. ప్రతీ మీటింగ్‌లో కేసీఆర్ కూర్చునే ఆ కుర్చీ ఖాళీగా కనిపించింది. ఆ మీటింగ్‌కు అధ్యక్షత వహించిన కేటీఆర్ కూడా కేసీఆర్ కుర్చీలో కూర్చోలేదు. ఆయన స్థానం ఆయనకే వదిలేసి.. వేరే చైర్‌లో కూర్చుని పార్టీ ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఈ మీటింగ్‌కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేసీఆర్ కుర్చీ ఖాళీగా కనిపించడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు చాలా ఫీలవుతున్నారు. పెద్దాయన త్వరగా ప్రజల్లోకి రావాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
గాయంతో మంచాన పడ్డ కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. చేతికర్ర సాయంతో కేసీఆర్ నడుస్తున్న వీడియోను రీసెంట్‌గానే ఎంపీ సంతోష్ ట్విటర్‌లో షేర్ చేశారు. త్వరలోనే ఆయన ప్రజల్లోకి రాబోతున్నట్టు చెప్పారు. పూర్తిగా కోలుకున్న వెంటనే కేసీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ సంగతి ఎలా ఉన్నా.. ఎమ్మెల్సీల మీటింగ్‌లో కేసీఆర్ కుర్చీ ఖాళీగా కనిపించడం ప్రతీ ఒక్క గులాబీ సైనికుడిని బాధిస్తోంది.