KCR’s tour : కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభం.. ఎండిన పంట పొలాలు పరిశీలన..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లా (Nalgonda Dist.)లో పర్యటన ప్రారంభంమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2024 | 11:10 AMLast Updated on: Mar 31, 2024 | 11:46 AM

Kcrs Tour Of Districts Begins Inspection Of Dry Crop Fields

 

 

 

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లా (Nalgonda Dist.)లో పర్యటన ప్రారంభమైంది. ఈ ఉదయం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి.. నీళ్లందక ఎండిన పంటలను పరిశీలనకు.. రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖమంత్రి కేసీఆర్. నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండాకు చేరుకోనున్నారు.

యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvangiri) జిల్లా మీదుగా జనగామకు బయలుదేరారు. 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. తర్వాత అర్వపల్లి, సూర్యాపేట మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేటలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు సూర్యాపేట పార్టీ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు చేరుకుంటారు. సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. సాయంత్రం 6గంటలకు బయలుదేరి నల్గొండ మీదుగా రాత్రి 9గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు.

ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు నల్లగొండ మండలం ముషంపల్లిలో కేసీఆర్‌ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ నాయకులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు. కాగా పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.