Kedarnath : ఉత్తరాఖండ్.. కేదార్‌నాథ్ BJP MLA మృతి…
ఉత్తరాఖండ్ లోని కేధార్ నాథ నియోజకవర్గం BJP MLA శైలా రావత్(68) మృతి చెందారు.

Kedarnath BJP MLA in Dev Bhumi Himalayan state of Uttarakhand dies...
దేవ్ భూమి హిమాలయ రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయంతో మరో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కాగా తాజాగా ఉత్తరాఖండ్ లోని కేధార్ నాథ నియోజకవర్గం BJP MLA శైలా రావత్(68) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే శైలా రావత్ వెన్నెముక సమస్యతో ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.
దీంతో ఆమె పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్నుమూశారు. ఇక శైలా రావత్ 2012లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా కేదార్‌నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 22016లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆమె BJPలో చేరారు. ఆ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2022లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.