Kerala High Court: పోర్న్ వీడియోలు చూడటం పై కేరళ హైకోర్ట్ సంచలన తీర్పు
అశ్లీల బూతు వీడియోలు, ఫోటోలు చూడటం కరెక్టా కాదా అంటే.. కొందరు కరెక్ట్ అని, మరి కొందరు సరైన పద్దతి కాదని వాదిస్తారు. దీనిపై కేరళ హైకోర్ట్ ఏం చెప్పిందో చూద్దాం.
పోర్నోగ్రఫీ అనేది ఎప్పటి నుంచో సమాజంలో ఉంది. ఇప్పుడు కొత్తగా ఏమీ ఊడిపడలేదు. అవసరం అనుకున్న వాళ్లు మాత్రమే వాటి జోలికి వెళ్తారు. అయితే తాజాగా కేరళ హైకోర్టు పోర్న్ చూడటం తప్పా కాదా అనే అంశంపై బుధవారం సంచల తీర్పు వెలువరించింది.
సంచలన తీర్పు
2016లో అలువ ప్యాలెస్ రోడ్డు పక్కన 33 ఏళ్ల యువకుడు తన ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ ఉన్నాడు. దీనిని గమనించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలించారు. దీంతో నిందితుడు కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కేరళ హైకోర్ట్ విచారణ చేపట్టింది. సుదీర్ఘ కాలం సాగిన విచారణ తరువాత ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. పోర్న్ చూడటం అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగతమైన అంశం. దీనిని నేరంగా పరిగణించలేం. ఎందుకంటే వారి వ్యకి గత స్వేచ్ఛను భంగం కలిగించినట్లవుతుంది. అయితే సమాజంలో అందరి మధ్యలో చూడటం నేరం అని తీర్పును ఇచ్చింది. ఒంటరిగా ఉన్నప్పుడు చూడటం వల్ల ఐపీసీ సెక్షన్ 292 వర్తించదని తెలిపింది. దీంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. నిర్థోషిగా బయటకు వచ్చాడు. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను కోర్ట్ ప్రస్తావించింది.
హై కోర్ట్ సూచనలు..
చిన్న పిల్లలకు ఫోన్ అలవాటు చేయడం సరైన పద్దతి కాదని పేర్కొంది. పైగా ఇంటర్నెట్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవ్వడం వల్ల వారు చెడు మార్గం పట్టే ప్రమాదం ఉందని వివరించింది. కావాలని అశ్లీల వైపుకు మొగ్గ చూపకున్నా కొన్ని సైట్లు అప్పుడప్పుడూ స్క్రీన్ పై ప్రత్యక్షమౌతాయని వాటిని ఓపెన్ చేయడం ద్వారా ఇలాంటివి వాళ్ల కంటపడే అవకాశం ఉంటుందని తెలిపింది. ఇప్పుడున్న ఆన్లైన్ యుగంలో కేవలం తరగతులు జరిగే సమయంలో మాత్రమే ఫోన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. సెలవు దినాల్లో ఇంటర్నెట్ గేమ్స్ కాకుండా శారీరకంగా వ్యయామాన్ని కలిగించేలా ఫుట్ బాల్, క్రికెట్ వంటి ఔట్ డోర్ గేమ్స్ ని ప్రేరేపించేలా పేరెంట్స్ చొరవ తీసుకోవాలని కోరింది.
T.V.SRIKAR