shatamanam bhavathy sequel : ‘శతమానంభవతి’ సీక్వెల్ లో కీలక మార్పులు
శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ‘శతమానంభవతి’ మంచి విజయాన్ని సాధించింది.

Key changes in the sequel to 'Shatamanambhavathy'
శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ‘శతమానంభవతి’ మంచి విజయాన్ని సాధించింది. పిల్లలు ఉద్యోగాలు పేరుతో విదేశాలకు వెళ్లిపోవడం.. ఆ తర్వాత తల్లిదండ్రులు ఒంటరి అయిపోవడం అనే కాన్సెప్ట్ తో ఉద్వేగభరితంగా సాగే కథాంశంతో ఈ సినిమా వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు.
2017 సంక్రాంతి బరిలో చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లతో పోటీపడి విడుదలైన ‘శతమానంభవతి’ కూడా ఘన విజయాన్ని సాధించింది. అలాంటి ‘శతమానంభవతి’కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేశాడు దిల్‌రాజు.
అయితే.. సీక్వెల్ కి దర్శకుడిగా తన కాంపౌండ్ లో పదేళ్లుగా పనిచేస్తున్న హరి అనే అతన్ని పరిచయం చేయబోతున్నాడట. ఇక.. హీరోగానూ శర్వానంద్ స్థానంలో ఆశిష్ ను తీసుకునే అవకాశం ఉందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటోన్న ‘శతమానంభవతి’ సీక్వెల్ ‘శతమానంభవతి నెక్స్ట్ పేజి’ త్వరలో పట్టాలెక్కనుంది. అయితే.. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామన్నారు. కానీ.. వచ్చే వేసవి బరిలో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్సెస్ ఉన్నాయట.