KFC Outlet at Ayodhya: అయోధ్యలో KFC ఔట్‌లెట్.. కానీ..!
అయోధ్యలో ఫ్రైడ్ చికెన్ అమ్మే KFC సంస్థను ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలని అయోధ్య జిల్లా యంత్రాంగం కోరడం విచిత్రంగా ఉంది. అయితే అయోధ్య పవిత్రతకు భంగం వాటిల్లకుండా శాఖాహార మెనూ మాత్రమే అందించాలని కండీషన్ పెట్టారు అధికారులు.

KFC Outlet at Ayodhya: అయోధ్యలో ప్రముఖ KFC కంపెనీ ఔట్ లెట్ ఏర్పాటు చేసుకోడానికి అనుమతి ఇవ్వాలని అయోధ్య జిల్లా యంత్రాంగం కోరుతోంది. KFC అంటేనే నాన్ వెజ్ రెస్టారెంట్. పేరులోనే ఫ్రైడ్ చికెన్ అని ఉంటుంది. KFC పూర్తి పేరు కెంటకీ ఫ్రైడ్ చికెన్. అలాంటిది శ్రీరామచంద్రుడి జన్మస్థలంలో KFC ఔట్ లెట్‌కి పర్మిషన్ ఇవ్వడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అయోధ్యలో ఉండే స్థానిక ముస్లింలు కూడా మాంసాహారం ముట్టుకోరు. తినరు. ఎవరికైనా తినాలని అనిపిస్తే అయోధ్య పక్కనే ఉన్న ఫైజాబాద్‌కు వెళ్లి అక్కడే తినేసి వస్తుంటారు.
Nagababu Anakapally MP :నాగబాబు ఆ స్థానం నుంచే పోటీ ! గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న జనసేన
అయోధ్య నగరంలో అన్ని మతాల వారు కూడా అంత పవిత్రతను పాటిస్తారు. కానీ అయోధ్యలో ఫ్రైడ్ చికెన్ అమ్మే KFC సంస్థను ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలని అయోధ్య జిల్లా యంత్రాంగం కోరడం విచిత్రంగా ఉంది. అయితే అయోధ్య పవిత్రతకు భంగం వాటిల్లకుండా శాఖాహార మెనూ మాత్రమే అందించాలని కండీషన్ పెట్టారు అధికారులు. ఒకవేళ నిజంగా KFC అయోధ్యలో ఔట్‌లెట్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకుంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేరియన్ KFC ఔట్‌లెట్‌ను అక్కడ ఏర్పాటు చేసే అవకాశముంది.
అయోధ్యలో KFC ఎందుకు..?
దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో ఇప్పుడు అయోధ్య కూడా చేరింది. ఇప్పటిదాకా తిరుమల తిరుపతి, షిరిడీ, కాశీ, మధుర, చార్ ధామ్, అమర్ నాథ్ యాత్రలకు వెళ్తున్నారు భక్తులు. ఈ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో స్థానికులకు కూడా ఉపాధి కలుగుతోంది. దేశంలోని చాలా పుణ్యక్షేత్రాల్లో మాంసం, మద్యంపై నిషేధం అమల్లో ఉంది. అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లలో వీటిని అమ్మరు. అయోధ్యలో ఇప్పటి వరకూ కూడా ఆ సంప్రదాయం కొనసాగుతోంది. కానీ అయోధ్యకు దేశీయులతో పాటు విదేశీయులు కూడా వస్తున్నారు. ఈ పవిత్రస్థలాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలన్న లక్ష్యంతోనే KFC కి అనుమతి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో చాలా ఏరియాల్లో KFC కొత్త కొత్త ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తోంది. గ్లోబల్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లలో KFC ఒక పెద్ద బ్రాండ్ గా ఉంది. అందుకే అయోధ్యలో పూర్తి శాఖాహార ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపాదన పంపుతోంది.
ఇక్కడ ఓ మల్టీనేషనల్ కంపెనీ పూర్తిగా శాఖాహారంతో ఫైవ్ స్టార్ హోటల్‌ను కూడా నిర్మించబోతోంది. అయోధ్యలో ఏర్పాటు చేసే KFCలో ఫ్రైడ్ చికెన్, మాంసాహారాలతో కాకుండా శాఖాహార రుచులు దొరకబోతున్నాయి. అంటే వెజ్ జింజర్ బర్గర్, వెజ్ రోల్స్, వెజ్ రైస్ బౌల్, వెజ్ బర్గర్ ఇలాంటి ఎన్నో వెరైటీలు మెనూలో ఉంటాయి. అంతర్జాతీయ బ్రాండ్ KFC అయోధ్యలోకి వస్తే.. మెక్‌డొనాల్డ్స్ లాంటి ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్ బ్రాండ్స్ కూడా పూర్ వెజ్ పేరుతో అయోధ్యలో తమ ఔట్‌లెట్స్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.