Khairatabad 2024 : ఖైరతాబాద్ బడా గణేష్.. 70 అడుగుల మట్టి మహాగణపతి
ఖైరతాబాద్ బడా గణేష్ (Khairatabad Bada Ganesh).. భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు.. దేశ చరిత్రలోనే ఖైరతాబాద్ (Khairatabad) గణేష్ కు ఉన్న చరిత్ర మరే ప్రాంతాన్నికి లేదు.
ఖైరతాబాద్ బడా గణేష్ (Khairatabad Bada Ganesh).. భారతదేశానికి పరిచయం అక్కర్లేని పేరు.. దేశ చరిత్రలోనే ఖైరతాబాద్ (Khairatabad) గణేష్ కు ఉన్న చరిత్ర మరే ప్రాంతాన్నికి లేదు. దేశ వ్యాప్తంగా చవితి ఉత్సవాల రోజుల్లో ఖైరతాబాద్ గణేష్ ను చూసేందుకు లక్షల మంది తరలి వస్తుంటారు. మరి అంతటి చరిత్ర ఉన్న మహా గణపతి విగ్రహ తయారీ లో కీలక దశ అయిన మట్టి పనులు ఖైరతాబాద్ లో మొదలైయ్యాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి రెండు పాదాల నుంచి మట్టి పనులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. మట్టి పనులతో రెండురోజుల్లో ఖైరతాబాద్ గణపతికి ఒక రూపం రానుంది. శ్రీ పంచముఖ మహాశక్తి గణపతి విగ్రహ నమూనాను నేటి సాయంత్రం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Nagender) ఇతర ప్రముఖులు ఆవిష్కరించనున్నారు.
దేశంలోని అందిరి చూపు ఆకట్టుకునే.. ప్రతిష్ఠాత్మక ఖైరతాబాద్(Khairatabad) గణపతి విగ్రహం తయారీలో కీలక దశగా అయిన మట్టి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి రెండు పాదాల నుంచి మట్టి పనులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ తో పాటు బీఆర్‌ఎస్ నేత బిల్డర్ రమేష్, టీపీసీసీ నేత మధుకర్‌యాదవ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి పనులతో రెండు రోజుల్లో ఖైరతాబాద్(Khairatabad) గణపతికి ఒక రూపం రానుంది. ఇప్పటికే వెల్డింగ్ పనులు పూర్తి కావోస్తున్నాయి. స్టీలు వెల్డింగ్ పైనుంచి సన్నటి మెష్ వేసే పనులు పూర్తి చేసి మట్టిపనులను ప్రారంభించారు.
70 అడుగుల మట్టి మహా గణపతి…
ఖైరతాబాద్ గణేశ్ మండలి నిర్వాహకులు వినాయక విగ్రహం ఏర్పాటుకు కర్రపూజ నిర్వహించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఇక ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహం ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది వినాయక చవితి పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో 70 అడుగుల మట్టి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఖైరతాబాద్‌లో మహా గణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్టించారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతికి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్టించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతేడాది ఇక్కడి వినాయకుడు 45 నుంచి 50 టన్నుల బరువుతో 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా సరికొత్త రికార్డు సృష్టించాడు.