King Charles: బ్రిటన్ కింగ్‌కు కేన్సర్.. కోహినూర్ వజ్రం శాపమేనా..? భయపెడుతోన్న డైమండ్ చరిత్ర..
కోహినూర్ వజ్రం వల్లే.. కింగ్ ఛార్లెస్‌కు ఇలా జరిగిందంటూ.. డైమండ్ చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. కోహినూర్ డైమండ్ ధరించిన వాళ్లందరూ.. దారుణమైన స్థితిలో చనిపోయారు. ఆ వజ్రం దొరికినప్పటి నుంచి బ్రిటీష్ అధికారులు లూటీ చేసేంత వరకు ఇలాంటి సంఘటనలే కనిపించాయ్.
King Charles: బ్రిటన్ రాజు ఛార్లెస్ కేన్సర్ బారినపడ్డారు. ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన టెస్ట్‌లు చేసే సమయంలో.. వ్యాధి నిర్ధారణ జరిగింది. దీంతో కొన్నిరోజులు ఆయన విధులకు దూరంగా ఉండబోతున్నారు. ఐతే ఇప్పుడీ న్యూస్ వాల్డ్‌వైడ్‌గా సంచలనం రేపుతోంది. కోహినూర్ వజ్రం వల్లే.. కింగ్ ఛార్లెస్‌కు ఇలా జరిగిందంటూ.. డైమండ్ చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. కోహినూర్ డైమండ్ ధరించిన వాళ్లందరూ.. దారుణమైన స్థితిలో చనిపోయారు. ఆ వజ్రం దొరికినప్పటి నుంచి బ్రిటీష్ అధికారులు లూటీ చేసేంత వరకు ఇలాంటి సంఘటనలే కనిపించాయ్. క్వీన్ ఎలిజబెత్ 2 మరణం సమయంలోనే.. కోహినూర్ వజ్రం అంశం తెరపైకి వచ్చింది.
Upasana Kamineni: మండిపాటు.. ఉపాసనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్
ఆ వజ్రాన్ని ధరించకపోవడం వల్లే ఆమె అన్నిరోజులు బతికారంటూ.. లేదంటే ఇంకోలా ఉండేదనే చర్చ జరిగింది. చరిత్రలో చాలా పేజీలు ఉంటాయ్. అందులో ప్రత్యేకంగా కోహినూర్ గురించి ఉంటుంది. ఎన్ని తరాలు మారినా.. కోహినూర్ ప్రస్తావన లేకుండా సంపద గురించి మాటలు ఉండవ్. రాజసానికి, దర్పాణికి ప్రతీకగా నిలిచిన కోహినూర్ వజ్రం చరిత్ర మొత్తం రణరంగ రక్తసిక్తమే! ఈ వజ్రం ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. చెడు జరిగిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయ్. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్‌కు నౌకలో తీసుకెళ్తుండగా.. ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు. కోహినూర్ డైమండ్.. ఇంగ్లండ్ గడ్డపైకి వచ్చిన రోజునే.. రాణి విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. 14వ శతాబ్దం ప్రారంభంలో.. గోల్కొండ సామ్రాజ్యంలో కోహినూర్ వజ్రం దొరికినట్లు చరిత్ర చెప్తోంది. గోల్కొండ రాజ్యంలో ఓ గుడిలోని దేవత కంటిలో కోహినూర్ వజ్రం ఉండేదని.. ఆ కంటిలో నుంచి తీసుకురావడం వల్లే ఆ వజ్రం వల్ల చెడు జరుగుతుందన్న వాదనలు ఉన్నాయ్. కోహినూర్ కథ.. కొన్ని వేల సంవత్సరాల కిందే మొదలైంది.
YATRA 2: యాత్ర 2 సినిమా కోసం అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సమావేశాలు వాయిదా..
పురాణాల్లో ప్రస్తావించిన శమంతకమణి ఇదే అన్నది చాలామంది వాదన. మహాభారత యుద్ధం తర్వాత శమంతకమణి జాడ ఎవరికీ తెలియలేదు. యుగం మారిన తర్వాత శమంతకమణి గుంటూరు జిల్లాలో తవ్వకాల్లో బయటపడిందని అంటారు. పేరు కోహినూర్‌గా మారిన తర్వాత ఎంతోమంది చేతులు మారింది. దీనికోసం మరోసారి యుద్ధాలు తప్పలేదు. కోహినూర్ వజ్రం విషయంలో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయ్. దీన్ని స్త్రీలు ధరిస్తే మహా శక్తిమంతులవుతారని.. పురుషులు ధరిస్తే మాత్రం అరిష్టం తప్పదని అంటారు. కోహినూర్ చరిత్రలో ప్రతీ పేజీకి రక్తం మరకలే కనిపిస్తాయ్. తెలంగాణకు చెందిన గోల్కొండ రాజ్యంలో దొరికిన కోహినూర్ వజ్రం.. ఆ తర్వాత చాలామంది చేతులు మారింది. ఖిల్జీలు, తుగ్లక్‌లు, లోథీలు, మొఖల్, మరాఠా, పర్షియన్లు, దుర్రానీలు, ఆప్ఖన్ కనాటే, సిక్కులు.. ఇలా ఇందరి చేతులు మారి చివరికి బ్రిటీష్‌వాళ్లకు దక్కింది. షాజహాన్ దగ్గరకు 1656లో ఈ డైమండ్ చేరింది. ఆ తర్వాత ఆయన్ని కుమారులే బంధించి జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆ ఇద్దరు కుమారుడు సింహాసనం ఎక్కగా.. పర్షియన్ రాజులు దండయాత్ర చేసి ఓడించారు. ఆ సమయంలో రక్తం ఏరులై పారింది.
ఆ తర్వాత ఆ వజ్రం పర్షియన్ రాజు.. నాదర్ షా దగ్గరకు చేరింది. ఆయన బతికుండగానే ఆయన కుమారుడి రెండు కళ్లను పీకి.. వాటిని పళ్లెంలో పెట్టి శత్రువులు నాదర్ షాకు పంపించారు. ఆ తర్వాత నాదర్ షా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కోహినూర్ వజ్రం చేతులుమారి అఫ్ఘానిస్తాన్‌లోని కాందహార్‌కు చేరుకుంది. అక్కడి నుంచి 1750వ దశకంలో మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా దగ్గరకు కోహినూర్ వజ్రం చేరింది. కొంతకాలానికే ఆయనకు క్యాన్సర్ వచ్చింది. ఆ సమయంలో ఈ వజ్రాన్ని ఓ గోడ సందులో దాచారని ప్రచారం. అది ఓ అఫ్ఘాన్ అంగరక్షకుడి ద్వారా కాబూల్‌కు చేరింది. అక్కడ ఓ హారం ద్వారా కోహినూర్ వజ్రం.. పంజాబ్ రాజు మహారాజ రంజిత్ సింగ్ దగ్గరకు 1839లో చేరింది. కొన్నిరోజులకే ఆయన హత్యకు గురయ్యారు. ఆ తర్వాత పదేళ్లకు బ్రిటీషర్లు పంజాబ్‌పై దాడిచేసి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లారు. అప్పటి నుంచి అది అక్కడే ఉంది. ఆ వజ్రాన్ని ధరించకపోవడం వల్లే.. క్వీన్ విక్టోరియా ఎక్కువ రోజులు బతికిందని.. ఇప్పుడు దాన్ని ధరించిన చార్లెస్ కేన్సర్ బారినపడ్డారనే చర్చ జరుగుతోంది. దీంతో కోహినూర్ కథ.. గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.