Nagarjuna: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఊర మాస్‌ లుక్‌లో నాగార్జున

నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా నా సామి రంగ పోస్టర్ విడుదల చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 29, 2023 | 02:04 PMLast Updated on: Aug 29, 2023 | 2:04 PM

King Nagarjun Birthday Special Naa Samiranga Poster Release

కింగ్‌ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా నుంచి అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. సినిమాకు నా సామిరంగ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేస్తూ నాగార్జున ఫస్ట్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. చాలా కాలం తరువాత నాగార్జున్‌ మాస్‌ లుక్‌లో కనిపించాడు. నోట్లో బీడీతో ఊరమాస్‌ లుక్‌లో కనిపించాడు నాగార్జున.ఈ పండక్కి నా సామిరంగా అంటూ గ్లింప్స్‌ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్‌కి మాస్‌ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్‌ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఆస్కార్‌ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నారు. గ్లింప్స్‌లో బీజీఎం కూడా అద్బుతంగా ఉంది. సీన్‌కు తగ్గట్టుగా ఇంటెన్సివ్‌గా కంపోజ్‌ చేశారు కీరవాని. నాగార్జున కెరీర్‌లో 99వ సినిమాగా వస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే మొదలు కానుంది. అనుకున్న టైంకి షూటింగ్‌ కంప్లీట్‌ చేసి సంక్రాంతికి సినిమాను ఆడియన్స్‌ ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్.