KISHAN REDDY: బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయి: కిషన్ రెడ్డి
బీజేపీని ఓడించటానికే కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు అమలుచేయాలంటే, ప్రస్తుతం ఉన్న బడ్జెట్‌కు మూడు రెట్లు ఎక్కువ నిధులు కావాలి.
KISHAN REDDY: తెలంగాణలో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు కేంద్ర మంత్రి, టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. “రైతు బంధు పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోంది. అంతగా రైతులపై ప్రేమ ఉంటే.. రైతు బంధు ఇవ్వాలి అనుకుంటే.. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇవ్వాల్సింది. ఎన్నికల్లో నేరుగా గెలిచే సత్తా లేక. రైతులను, ప్రజలను మభ్యపెడుతూ బీఆర్ఎస్ చీప్ ట్రిక్స్ చేస్తోంది.
Rahul Gandhi : రైతు నోటికాడి బుక్కను లాక్కున్న కాంగ్రెస్ : ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్, బిజెపి ఒకటే అని చెబుతున్న వారిని చెప్పులతో కొట్టాలి. ఎట్టి పరిస్థితులలోనూ మేం ఎవరితోనూ కలిసేది లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లొంగకుండా కేంద్రంలో BJP నాయకత్వంలో ప్రభుత్వ పనితీరు చూసి, ఎలాంటి పొరపాటు లేకుండా ఓటు వినియోగించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. బీజేపీని ఓడించటానికే కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు అమలుచేయాలంటే, ప్రస్తుతం ఉన్న బడ్జెట్‌కు మూడు రెట్లు ఎక్కువ నిధులు కావాలి. బీజేపీ అధికారంలోకి రాగానే, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా పేరు మారుస్తాం. మైనారిటీ ఓట్లకోసమే రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇస్తున్నారు.
బీజేపీ ఒక్కటే కుల, మత, ప్రాంతాలకు అతీతంగా హామీలిస్తోంది. ఇచ్చిన మాటను తప్పక అమలు చేస్తుంది. మద్రాస్‌ను చెన్నైగా, కలకత్తాను కోల్‌కత్తాగా, బాంబేను ముంబైగా మార్చినపుడు.. హైదరాబాద్ పేరు మార్చడంలో తప్పులేదు. హైదరాబాద్‌ను భాగ్య నగరంగా మార్చి తీరుతాం. రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చాం. ఇది ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. బానిస మనస్తత్వానికి సంబంధించిన ప్రతీకలను తొలగించాం” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.