పవన్ కల్యాణ్ ని ఏమీ అనలేదు… సోషల్ మీడియాలో దుష్ప్రచారం: కిషన్ రెడ్డి
పవన్ కల్యాణ్ పై తానేదో కామెంట్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... అవన్నీ అబద్దమని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీస్ కేసు పెట్టినట్టు చెప్పారు.
Kishan Reddy on Pawan: పవన్ కల్యాణ్‌ను నేను ఏదో అన్నట్టుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. దీన్ని ఖండిస్తున్నానని అన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అలాంటి మాటలే జరగలేదు. ఎవరో ఏదో రాసి పెడితే..ఎలా? దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. రూల్స్ కి విరుద్ధంగా, సీనియారిటీని కాదని, తమ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ కు చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్ గా నియమించడం.. శాసనసభ నిబంధనల ఉల్లంఘనే అన్నారు.. అందుకే తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరించామన్నారు కిషన్ రెడ్డి. రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే తమ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని చెప్పారు. తెలంగాణలో 100 శాతం ఓటింగ్ పెరిగిన ఏకైక పార్టీ.. బీజేపీయే అన్నారు కిషన్ రెడ్డి. అన్నింటికీ మించి.. ఔట్ గోయింగ్, ఇన్ కమింగ్ సీఎం అభ్యర్థులను ఓడించి బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు.
YS JAGAN: వైసీపీకి 50మంది ఎమ్మెల్యేలు షాక్ ! ఇప్పుడు ఆళ్ల.. నెక్ట్స్ ఎవరు ?
రాహుల్ ఫ్రెండ్ దగ్గర కోట్లు పట్టుబడ్డయ్
రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితుడు.. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు దగ్గర రూ.351 కోట్లు బయటపడ్డాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సాహు వ్యాపారాలపై ఆదాయపు పన్ను శాఖాధికారులు చేసిన దాడులు దేశ చరిత్రలోనే సంచలనం కలిగించాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ డబ్బు పట్టుబడటం ఇదే ఫస్ట్ టైమ్ అన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో.. సోషల్ మీడియాలో ధీరజ్ సాహు పోస్టు చేస్తూ.. ‘కొందరు ఇంత పెద్ద మొత్తంలో బ్లాక్ మనీని ఎందుకు దాచుకుంటారో అర్థం కావట్లేదు అని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆయన దగ్గరే భారీగా డబ్బులు పట్టుబడ్డాయన్నారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆర్థికంగా సాయం అందించిన వ్యక్తి ధీరజ్ సాహు అని ఆరోపించారు. రాహుల్ కనుసైగల్లో.. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం ఈ డబ్బు పోగు చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదాయపు పన్ను అధికారులను అభినందిస్తున్నాను. నల్లధనంపై జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నానన్నారు కేంద్ర మంత్రి. ప్రధాని ఆకాంక్షలను పూర్తిచేసే దిశగా ఇలాగే సంపూర్ణ సహకారం అందించాలని కోరుతున్నాను.