కొకైన్ వాడిన కివీస్ బౌలర్, ఒక నెల క్రికెట్ నుంచి బ్యాన్

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రేస్ వెల్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు బ్యాన్ చేసింది. ఒక నెల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కొకైన్ వాడడమే దీనికి కారణం. 34 ఏళ్ల బ్రేస్‌వెల్..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2024 | 01:21 PMLast Updated on: Nov 19, 2024 | 1:21 PM

Kiwi Bowler Banned From Cricket For One Month For Using Cocaine

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రేస్ వెల్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు బ్యాన్ చేసింది. ఒక నెల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. కొకైన్ వాడడమే దీనికి కారణం. 34 ఏళ్ల బ్రేస్‌వెల్.. ఈ ఏడాది జనవరిలో కొకైన్ వాడినట్లు తేలింది. వెల్లింగ్టన్‌, సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో అతను కొకైన్ వాడినట్టు పరీక్షల్లో నిర్థారణ అయింది. ఈ మ్యాచ్ లో బ్రేస్‌వెల్ ఆల్ రౌండ్ షో తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలిచాడు. బౌలింగ్ లో రెండు వికెట్లు పడగొట్టిన అతను బ్యాటింగ్ లో కేవలం 11 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. వీటితో పాటు రెండు క్యాచ్ లను అందుకున్నాడు. అయితే కొకైన్ వాడినట్టు తేలడంతో ముందు 3 నెలలు నిషేధించినా… పునరావాసం కింద ఒక నెలకు తగ్గించారు. గతంలోనూ బ్రేస్ వెల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడు.