భారత్ ఏ జట్టులో కెఎల్ రాహుల్ బీసీసీఐ కీలక నిర్ణయం

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధించేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో ఆస్ట్రేలియా 4-0తో గెలిస్తేనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్స్ ‌కు చేరుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 07:40 PMLast Updated on: Nov 04, 2024 | 7:40 PM

Kl Rahul Bccis Key Decision In Indias A Team

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు టీమిండియా అర్హత సాధించేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో ఆస్ట్రేలియా 4-0తో గెలిస్తేనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్స్ ‌కు చేరుతుంది. గత రెండు పర్యాయాలు భారత జట్టే గెలిచినా ప్రస్తుత ఫామ్ చూస్తే ఆసీస్ పై గెలవడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను ఆసీస్ సిరీస్‌కు తీర్చిదిద్దేలా బీసీసీఐ కార్యచరణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా టీమిండియా కంటే ముందే కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌ను ఆస్ట్రేలియాకు వెళ్లాలని ఆదేశించింది. నవంబర్ 7 నుంచి ఆస్ట్రేలియ-ఏ జట్టుతో భారత్-ఏ రెండో అనధికారిక టెస్టు ఆడనుంది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌కు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌ను ఆడించే అవకాశాలున్నాయి.