What’s App: వాట్సప్ వినియోగదారులు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి..
వాట్సప్ ఉపయోగించే వారు ఎలాంటి ప్రభుత్వ పరమైన చిక్కుల్లో పడకుండా ఉంటాలంటే ఈ క్రింది సూచనలు పాటించాలి. అంతేకాకుండా ఎలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా సురక్షితంగా ఉండాలంటే ఈ అంశాలను గమనించండి.
వాట్సప్ అనగానే ఒకరికొకరు పరస్పరం సందేశంతో పాటూ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలను పంపించుకునే గొప్ప సామాజిక మధ్యమం. దీనిని కొన్ని కోట్లమంది వినియోగిస్తున్నారు. అయితే తాజాగా 74లక్షల వాట్సప్ ఖాతాలు బ్లాక్ చేసినట్లు తెలిపింది మెటా సంస్థ. దీనికి కారణాలు కూడా వెలువరించింది. ఐటీ నిబంధనలకు విరుద్దంగా అసభ్య, అభ్యంతరకర సందేశాలు పంపించే వారిని గుర్తించింది. వీరి అకౌంట్లను బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది ఈ దిగ్గజ చాటింగ్ యాప్ సంస్థ.
వాట్సప్ గురించి మరిన్ని విషయాలు..
- ఒక రైట్ మార్క్ [✔ ]పడితే మీ సందేశం పంపబడింది అని అర్థం.
- రెండు టిక్ మార్కులు పడితే [✔✔ ]సందేశం బట్వాడా చేయబడినట్లు లెక్క.
- రెండు నీలం రంగు రైట్ మార్క్ [✔✔] కనిపిస్తే సందేశాన్ని చదివినట్లు.
- మూడు నీలం రంగు టిక్ మార్క్ [✔✔✔] కనిపిస్తే ప్రభుత్వం సందేశాన్ని పరిశీలిస్తున్నట్లు గుర్తించాలి.
- రెండు నీలంతో పాటూ ఒక ఎరుపు రంగు రైట్ కనిపిస్తే [✔✔✔] ప్రభుత్వం మీపై ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు.
- ఒక నీలంతో పాటూ రెండు ఎరుపు రంగులో కనిపిస్తే [✔✔✔] ప్రభుత్వం మీ సమాచారాన్ని తనిఖీ చేస్తోంది.
- మూడు ఎరుపు రంగు రైట్ మార్క్ కనిపిస్తే [✔✔✔] ప్రభుత్వం మీపై చర్యను ప్రారంభించింది కనుక త్వరలో మీకు కోర్టు సమన్లు అందుతాయి.
- ఇలాంటి పరిస్థితులు సాధారణంగా వాట్సప్ ఉపయోగించే వారికి అస్సలు తలెత్తవు. కేవలం అసాంఘీక కార్యకలాపాలు, అసభ్య, అభ్యంతరకరమైన సమాచారాలు, సందేశాలు, సమాజ విద్రోహ చర్యలకు పాల్పడినప్పుడు ఇలాంటి చట్టపరమైన పరిస్థితులు ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకోలేరు.
వాట్సప్ ప్రత్యేక సమాచారం..
వాట్సప్ వేదికగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీ వ్యక్తిగత వివరాలతోపాటూ బ్యాంకుకు సంబంధించిన వివరాలను లూటీ చేస్తున్నారు. డబ్బులు కాజేసేందుకు మీకు కొన్ని లింకులను పంపిస్తున్నారు. వీటిని ఓపెన్ చేయడం వల్ల మీ పూర్తి వివరాలను తమ ఆధీనంలోకి తీసుకొని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ కష్టపడకుండా హాయిగా ఒక చోట కూర్చొని డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. అందుకే ఈ కింది సూచనలు పాటిస్తే అతి సులువుగా వీరి బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
- తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకూడదు.
- ఆ నంబర్లను బ్లాక్ లిస్ట్ లో చేర్చి వాట్సప్ కు రిపోర్ట్ చేయాలి.
- మీ వ్యక్తిగత సమాచారాన్ని క్రెడిట్ కార్డులు, బ్యాంక్ లోన్ల పేరుతో ఎవరికి పడితే వారికి ఇవ్వకండి.
- ఒకటికి రెండు సార్లు పరీక్షించుకొని వాళ్లు నిజమైన సంస్థలకు చెందిన వారైతే సమచారం ఇవ్వండి.
- అనుమానాస్పదంగా, ఆకర్షణీయం సమాచారంతో కనిపించే లింకులపై క్లిక్ చేయొద్దు.
T.V.SRIKAR