KODALI NANI: పవన్‌ను నమ్ముకునే స్థాయికి చంద్రబాబు దిగజారారు: కొడాలి నాని
పవన్ కళ్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుంది. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జెండా సభలు పెట్టుకుంటున్నారు.

KODALI NANI: ప్రజలపై, తనపై, పార్టీపై నమ్మకం లేని చంద్రబాబు నాయుడు.. చివరకు పవన్ కళ్యాణ్‌ను నమ్ముకునే స్థాయికి దిగజారారని విమర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్, చంద్రబాబుపై విమర్శలు చేశారు. “సీఎం జగన్‌ను పవన్ కళ్యాణ్ తొక్కడం కాదు.. పవన్ కళ్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుంది.
TDP-BJP-JANASENA: ఢిల్లీకి చంద్రబాబు, పవన్.. బీజేపీతో పొత్తుపై తేల్చేస్తారా..?
ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జెండా సభలు పెట్టుకుంటున్నారు. ప్రజలను, పార్టీని, తనను నమ్ముకోని చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని ఆయన ఓటు బ్యాంకుతో గెలవాలన్న స్థాయికి దిగజారాడు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ.. సీఎం జగన్‌ను పవన్ కళ్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నారు. ప్రతిగా మేము మాట్లాడితే.. పవన్ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. చేసిన మంచిని చెబుతూ.. ప్రజలను నమ్మిన సీఎం జగన్. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నారు. 14 ఏళ్లు అధికారం వెలగబెట్టిన చంద్రబాబు.. ఐదేళ్లు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. మా పాలన చూసి ఓటెయ్యండని అడగలేని దుస్థితిలో ఉన్నారు. చంద్రబాబు తమ సామాజిక వర్గానికి 21 సీట్లు ప్రకటించారు. మరో 10 స్థానాలు ఇవ్వనున్నారు.
మూడు శాతం ఓటింగ్ ఉన్న వర్గానికి 31 సీట్లు ఇస్తే.. తమకు 20శాతం ఓటింగ్ ఉందని చెబుతున్న జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎన్ని సీట్లు ఇవ్వాలి..? 24 సీట్లతో తాము సంతృప్తిగా లేమని జనసైనికులు బహిరంగంగా చెబుతున్నారు. తనపై సింపతీ క్రియేట్ చేసుకొని, తన సామాజిక వర్గ ఓట్ల ద్వారా చంద్రబాబును సీఎం చేయడానికే.. పవన్ కళ్యాణ్ యుద్ధం మొదలుపెట్టినట్లు ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు” అని కొడాలి వ్యాఖ్యానించారు.