KODALI NANI: పొలాల్లో రాజధాని కడతామా.. జగన్ ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్: కొడాలి నాని

చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు. పొలాల్లో రాజధాని ఎలా కడతాం. రాజధాని రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏం త్యాగం చేశారు..? దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా..? ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2024 | 07:36 PMLast Updated on: Feb 23, 2024 | 7:36 PM

Kodali Nani Fires On Ex Cm Chandrababu Naidu Over Capital City

KODALI NANI: దేశంలో రాధాని కట్టిన నేత ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. పొలాల్లో రాజధాని ఎలా కడతామన్నాడు. కృష్ణాజిల్లా గుడివాడలో నాని మాట్లాడాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. “దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు. పొలాల్లో రాజధాని ఎలా కడతాం. రాజధాని రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏం త్యాగం చేశారు..?

PM Modi: ప్రధాని మోదీ గురించి అలాంటి సమాధానమా..? గూగుల్ ఏఐ జెమినిపై కేంద్రం ఆగ్రహం

మే నెలలో సీఎంగా జగన్ ప్రమాణం చేయకుండా ఆపగలిగే శక్తి రాష్ట్రంలో ఏ పొలిటిషన్‌కి లేదు. మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్‌కత్తా.. ఏ రాజధానిలో అయిన 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. మిగిలిన 99శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి. 33 వేల ఎకరాలు తీసుకొన్న చంద్రబాబు పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడు. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా..? రాజధాని కడతా అంటూ గ్రాఫిక్స్‌తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా..? దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా..? ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు. 25 లక్షల జనాభా.. పోర్టు.. అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే మహానగరం అయ్యి తీరుతుంది. వైజాగ్‌ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే.. వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చెయ్యొచ్చని జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు.

రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు.. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల సీఎం జగన్ పేదల ఖాతాల్లో వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. నేనైతే సంపద సృష్టించే వాడిని, జగన్‌కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు. జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా, ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మాన్. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి సీఎం జగన్” అని కొడాలి వ్యాఖ్యానించారు.