Kodandaram : విద్యాశాఖ మంత్రిగా కోదండరాం ! TSPSC ఛైర్మన్ ఎందుకివ్వలేదంటే..!

తెలంగాణ విద్యాశాఖలో యేళ్ళ తరబడి అనుభవం ఉన్న వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లెక్చరర్ గా.. ప్రొఫెసర్ గా విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తికి ఈ పోస్ట్ ఇస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. గవర్నర్ కోటాలో TJS అధ్యక్షుడు కోదండరామ్ కి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి ఈమధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేసి.. విద్యాశాఖ అప్పజెప్పాలని రేవంత్ నిర్ణయించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2024 | 11:35 AMLast Updated on: Jan 11, 2024 | 11:35 AM

Kodandaram As Minister Of Education Why Tspsc Chairman Did Not Give

తెలంగాణ విద్యాశాఖలో యేళ్ళ తరబడి అనుభవం ఉన్న వ్యక్తికి విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లెక్చరర్ గా.. ప్రొఫెసర్ గా విద్యారంగంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తికి ఈ పోస్ట్ ఇస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. గవర్నర్ కోటాలో TJS అధ్యక్షుడు కోదండరామ్ కి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి ఈమధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేసి.. విద్యాశాఖ అప్పజెప్పాలని రేవంత్ నిర్ణయించారు.

తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా.. అన్ని పార్టీలను ఏక తాటి మీదకు తెచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలంగా వ్యవహరించారు ప్రొఫెసర్ కోదండరామ్. ఆయన జేఏసీ కన్వీనర్ కాకముందు ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు. తెలంగాణలో మంచి విద్యావేత్తల్లో కోదండరామ్ ఒకరు. రాష్ట్రం ఏర్పడ్డాక.. KCR నియంతృత్వ పోకడలకు విసిగిపోయి.. సొంతంగా తెలంగాణ జన సమితి పార్టీ పెట్టుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో అయినా పోటీ చేద్దామనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు కోదండరామ్. ఆయన త్యాగానికి గుర్తింపుగా.. ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

కాంగ్రెస్ అధిష్టానం హామీ మేరకు.. ప్రొఫెసర్ కోదండరామ్ ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పంపాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ టైమ్ లో ఈ కోటాలో ఎంపిక చేసిన వారు అనర్హులు అంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అందుకే ఈసారి విద్యారంగంలో ఉన్నతుడైన కోదండరామ్ పేరును ప్రపోజ్ చేయడం వల్ల గవర్నర్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని రేవంత్ భావించారు. తెలంగాణ మంత్రుల శాఖలు ప్రకటించిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ హయాంలో విద్యాశాఖ మొత్తం భ్రష్టు పట్టుపోయింది. ఇంటర్ మార్కుల్లో అవకతవకలు దగ్గర నుంచి TSPSC పేపర్ల లీకేజీల దాకా.. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ, పుట్టెడు సమస్యలు ఇలాంటి ఎన్నో లోపాలు బయటపడ్డాయి. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి పనిచేసినా.. కేసీఆర్, కేటీఆర్ ను కాదని.. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఆమెకు లేదు. కనీసం భారీ వర్షాలు కురిసి.. జనం బయటకు రాలేని పరిస్థితుల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలన్నా.. కేసీఆర్ పర్మిషన్ కావాల్సిందే. ఒక రోజు ఇలాగే…పిల్లలంతా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళాక ఆలస్యంగా సెలవు ప్రకటించిన సబితా ఇంద్రారెడ్డి.. సోషల్ మీడియాలో నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కేసీఆర్ హయాంలో భ్రష్టుపట్టుపోయిన విద్యాశాఖను.. రేపు కోదండరామ్ ఎమ్మెల్సీ అయ్యాక.. ఆయనకు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యావేత్తగా ఎంతో అనుభవం ఉన్న కోదండరామ్.. ఆ శాఖ బాధ్యతలు చేపడితే.. తెలంగాణ జనంతో పాటు విద్యార్థులు, యువత హ్యాపీగా ఫీలవుతారని భావిస్తున్నారు.

కోదండరామ్ కి TSPSC ఛైర్మన్ పదవి ఇస్తారన్న టాక్ కూడా నడిచింది. అయితే TSPSC ఛైర్మన్ కి వయస్సు 62 యేళ్ళలోపు మాత్రమే ఉండాలి. కానీ కోదండరామ్ కి ఇప్పుడు 68 సంవత్సరాలు ఉన్నాయి. అందుకే ఆ పదవికి కాకుండా.. సలహాదారుగా కాకుండా.. విద్యాశాఖను అప్పగిస్తే బెటర్ అని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. అందుకే ఆ శాఖను ఎవరికీ అప్పగించకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. అది కోదండరామ్ కోసమే ఉంచినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.