తొక్కలో కెప్టెన్సీ చేస్తున్నాడు, పటిదార్ పై కోహ్లీ గరం గరం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్‌పై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.. మైదానంలోనే రజత్ పటీదార్ కెప్టెన్సీని తప్పుబడుతూ గట్టిగా అరిచేసాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటీదార్‌పై ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.. మైదానంలోనే రజత్ పటీదార్ కెప్టెన్సీని తప్పుబడుతూ గట్టిగా అరిచేసాడు. బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రజత్ పటీదార్ సరైన ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేయడం లేదని కోహ్లీ అరిచేసాడు. అతని సలహాలను పట్టించుకోకుండా ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు చేసి ఓటమికి కారణమయ్యాడని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ఆర్‌సీబీ స్వల్ప లక్ష్యమే నమోదు చేసినా.. బౌలర్లు శుభారంభం అందించడం.. పిచ్ స్లోగా ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. 14 ఓవర్లలో 99 పరుగులే చేసింది. ఢిల్లీ విజయానికి చివరి 36 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉండగా…హజెల్ వుడ్ వేసిన 15వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ 22 పరుగులు బాదేశాడు దాంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఈ ఓవర్ తర్వాత కోహ్లీ రజత్ పటీదార్‌పై గట్టిగా అరిచాడు.
ఇదేం ఫీల్డ్ సెటప్ అని మండిపడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర టీమ్ మెంటార్ దినేశ్ కార్తీక్‌తో కూడా రజత్ పటీదార్ కెప్టెన్సీ తప్పిదాలను ప్రస్తావించాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ.. బౌలర్లు, ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం సరిగా లేదన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ నిర్ణయంపై అసంతృప్తితోనే కోహ్లి ఇలా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన సమయంలో హిందీ కామెంట్రీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కోహ్లీ నిజానికి కెప్టెన్ రజత్ పాటిదార్‌తో మాట్లాడాల్సిందంటూ సలహా ఇచ్చాడు. పైగా ఈ మ్యాచ్ లో పాటిదార్ కేఎల్ రాహుల్ క్యాచ్ ను డ్రాప్ చేసి పెద్దపొరపాటు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉండుంటే ఆర్సీబీ జట్టు విజయం సాధించే అవకాశాలు ఉండేవి. దయాల్ వేసిన ఓవర్లో రెండో బంతిని కేఎల్ రాహుల్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా… పాటిదార్ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ బాల్ ను క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. డ్రైవ్ చేసి బాల్ ను అందుకొనే ప్రయత్నం చేయగా.. బాల్ చేతిలో పడి మిస్ అయింది. ఈ అవకాశాన్ని కేఎల్ రాహుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆచితూచి ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. అప్పుడు కూడా కోహ్లీ రియాక్షన్ వైరల్ గా మారింది.
మొత్తం మీద కోహ్లీ మద్దతుతోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రజత్ పటీదార్.. అతన్నే పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రజత్ పటీదార్ కెప్టెన్సీపై వేటు వేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఓటమితో ఆర్‌సీబీ జట్టులో విభేదాలు బయటపడ్డాయని కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం రజత్ పటీదార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా కోహ్లీ నిరాకరించాడు.