Kohli : ఐపీఎల్ సిక్సర్ల కింగ్ ఇక కోహ్లీ..
టీమిండియా (Team India) మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) స్టార్ విరాట్ కోహ్లి (Star Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు.

Kohli is the King of IPL Sixers.
టీమిండియా (Team India) మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) స్టార్ విరాట్ కోహ్లి (Star Virat Kohli) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆర్సీబీ ఆటగాడిగా విరాట్ రికార్డలకెక్కాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు కోహ్లి ఐపీఎల్‌లో 241 సిక్స్‌లు బాదాడు. కాగా ఇంతకముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్, ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఐపీఎల్‌లో 239 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో గేల్ రికార్డు బద్దలైంది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతులు ఎదుర్కొన్న 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు.