కోహ్లీ మళ్ళీ అదే తప్పు, అనుష్క రియాక్షన్ వైరల్

సిడ్నీ టెస్టులో టీమిండియా బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. చెత్త షాట్లు ఆడుతూ చిరాకు పుట్టించారు. పేలవమైన ఫామ్ కారణంగా, రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2025 | 08:01 PMLast Updated on: Jan 03, 2025 | 8:01 PM

Kohli Makes The Same Mistake Again Anushkas Reaction Goes Viral

సిడ్నీ టెస్టులో టీమిండియా బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. చెత్త షాట్లు ఆడుతూ చిరాకు పుట్టించారు. పేలవమైన ఫామ్ కారణంగా, రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ జట్టును ఆదుకుంటాడని అంతా భావించినప్పటికీ ఆస్ట్రేలియా బౌలర్లు కోహ్లీని టార్గెట్ చేసి పెవిలియన్ కి దారి చూపించారు. ఆశ్చర్యం ఏంటంటే.. కోహ్లి మళ్లీ మళ్లీ అదే తరహాలో వికెట్ సమర్పించుకున్నాడు.

సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో కోహ్లికి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే అవకాశం వచ్చింది. కాస్త ఓపికతో, పట్టుదలతో ఆడితే భారీ ఇన్నింగ్స్‌ ఆడి ఉండేవాడు. ఎనిమిదో ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ తొలి బంతికే ఔట్ అయ్యేవాడు. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని ఆఫ్ స్టంప్ వెలుపల కోహ్లి డిఫెండ్ చేశాడు. బంతి బ్యాట్ అంచుని తీసుకొని స్లిప్‌కు వెళ్లింది. అయితే స్టీవ్ స్మిత్ డై క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బంతి గాల్లోకి లేవడంతో స్మిత్ బంతిని అందుకోలేకపోయాడు. సమీపంలో నిలబడిన మార్నస్ లాబుస్చాగ్నే క్యాచ్ పట్టాడు. అంపైర్‌కు బంతి నేలకు తాకినట్టు అనుమానం వచ్చి థర్డ్ అంపైర్ సహాయం కోరాడు. బంతి నేలను కొద్దిగా తాకినట్లు రీప్లేలు చూపించాయి. దీంతో థర్డ్ అంపైర్ కోహ్లీని నాటౌట్‌గా ప్రకటించాడు. దీని తర్వాత ఓపికగా బ్యాటింగ్ చేసిన కోహ్లి.. తొలి సెషన్ ముగిసే వరకు కొనసాగాడు. రెండో సెషన్‌లో అతనిపై అంచనాలు పెరిగాయి. కానీ బోలాండ్ ఆఫ్ స్టంప్ వెలుపల ఒక గుడ్ లెంగ్త్ బంతిని వేయగా దాన్ని కోహ్లి ఆడటానికి ప్రయత్నించగా బంతి బ్యాట్ అంచుని తీసుకొని స్లిప్స్‌లో ఉన్న బ్యూ వెబ్‌స్టర్ చేతుల్లోకి వెళ్ళింది. కోహ్లీ 69 బంతుల్లో 17 పరుగులు చేశాడు.

కోహ్లీ ఆడుతుండగా స్టాండ్స్‌లో కూర్చున్న అతని భార్య అనుష్క శర్మ కూడా కాన్ఫిడెన్స్ గా కనిపించింది. ఈసారి కోహ్లీ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడతాడని ఆమె కూడా భావించింది. అయితే కోహ్లీ మరోసారి విడలమయ్యాడు. అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాబట్టలేకపోయాడు. కోహ్లి వికెట్ పడడంతో భార్య అనుష్క తీవ్ర నిరాశకు గురైంది.ఈ సిరీస్ లో ఒకే తరహా బంతికి అవుట్ అయిన విరాట్ కీలక టెస్టులోనూ అదే పంథాలో అవుట్ అవ్వడాన్ని అనుష్క కూడా జీర్ణించుకోలేకపోయింది.