కోహ్లీ ఇక కేరాఫ్ లండన్, రిటైర్మెంట్ తర్వాత షిఫ్టింగ్
భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ లో సెటిల్ కాబోతున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరుచూ లండన్ వెళ్తుండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి లండన్ లో సెటిల్ కాబోతున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరుచూ లండన్ వెళ్తుండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఇప్పటికే పలుసార్లు విరాట్ స్వయంగా తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటంతో ఈ ఊహాగానాలు బలపడ్డాయి. తన క్రికెట్ కెరీర్ ముగిసే సమయానికి సెలబ్రిటీ లైఫ్ కు దూరంగా సామాన్య జీవితం గడపాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. భారత్ లో అయితే ఇది కుదిరే పని కాదని కోహ్లీకి తెలుసు. అందుకే లండన్ లో సెటిల్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న కోహ్లీ, అనుష్క దంపతులకు కుమారుడు అకాయ్ లండన్‌లోనే జన్మించాడు.
తాజాగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. విరాట్ కోహ్లీ భార్య పిల్లలతో లండన్‌లోనే సెటిల్ అవుతాడని చెప్పాడు.కోహ్లీ కుటుంబం ఈ ఏడాది ఎక్కువ కాలం లండన్‌లో గడిపిందనీ గుర్తు చేశాడు. యూకేలో కోహ్లీకి ఇల్లుతో పాటు ఆస్తులు ఉన్నాయని వెల్లడించాడు. భార్య పిల్లలతో లండన్‌లోనే సెటిలవ్వాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లి రిటైర్మెంట్ పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు.కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడనీ, రిటైర్ అయ్యేంత వయసు అతనికి లేదన్నాడు. మరో ఐదేళ్లపాటు క్రికెట్ ఆడుతాడని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాతే కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడనీ అభిప్రాయ పడ్డాడు.
విరాట్ కోహ్లీ ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని రాజ్‌కుమార్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్‌కు వెళ్లాలని విరాట్ తీసుకున్న నిర్ణయం గురించి మాజీ కోచ్ బయటపెట్టడంతో వచ్చే ఏడాది ఇది జరిగే అవకాశం కనిపిస్తోంది.