ఏడుస్తూ కూర్చున్న కోహ్లీ, సీక్రేట్ రివీల్ చేసిన బాలీవుడ్ హీరో

ఆన్ ది ఫీల్డ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు.. అలాంటి కోహ్లీ గదిలో కూర్చుని ఏడ్చాడంటే నమ్మగలరా.. తాజాగా కోహ్లీకి సంబంధించిన ఆసక్తికరం విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 21, 2024 | 09:00 PMLast Updated on: Dec 21, 2024 | 9:00 PM

Kohli Sits Crying Bollywood Hero Reveals Secret

ఆన్ ది ఫీల్డ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో అందరికీ తెలుసు.. అలాంటి కోహ్లీ గదిలో కూర్చుని ఏడ్చాడంటే నమ్మగలరా.. తాజాగా కోహ్లీకి సంబంధించిన ఆసక్తికరం విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లి ఫామ్‌లో లేనప్పుడు అతని మనస్తత్వం ఎలా ఉంటుందో అనుష్క నాతో పంచుకుందని వరుణ్ ధావన్ చెప్పాడు. 2018లో బర్మింగ్‌హామ్ టెస్ట్ గురించి వరుణ్ చెప్తూ.. ఆ టెస్టులో భారత్ ఓడిపోయింది. ఆ రోజు మ్యాచ్ చూసేందుకు వెళ్లలేదని అనుష్క చెప్పింది. హోటల్‌కి తిరిగి వచ్చేసరికి విరాట్ గదిలో ఏడుస్తూ కనిపించాడట. నిజానికి ఆ సిరీస్ లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 97, 103 పరుగులతో సత్తా చాటిన కింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న అతను ఓటమి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఫామ్ చర్చనీయాంశంగా మారింది.పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకాన్ని నమోదు చేసిన విరాట్ కోహ్లి తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుత సిరీస్‌లో అతని సగటు 25.06 మాత్రమే. ఇప్పుడు విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాల్గవ టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పెర్త్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో తప్ప కోహ్లి బ్యాట్ నుంచి ఆశించిన పరుగులు రాలేదు. మెల్‌బోర్న్‌లో కోహ్లీ భారీ ఇన్నింగ్స్ విమర్శకుల నోళ్లు మూయిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో జరిగిన గత మూడు టెస్టుల్లో 52.66 సగటుతో స్కోర్ చేశాడు. ఆ పిచ్ పై కోహ్లీ అత్యుత్తమ స్కోరు 169. సిడ్నీలో అతను 49.60 సగటుతో 248 పరుగులు చేశాడు