కోహ్లీదే తప్పు…కాదు జైశ్వాల్ దే పఠాన్,మంజ్రేకర్ వాగ్వాదం
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీస్కోరుకు భారత్ ధీటుగానే బదులిచినట్టే ఇచ్చి అనూహ్యంగా చతికిలపడింది. 152 పరుగులకు 2 వికెట్ల నుంచి 159కి 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ వరుస వికెట్లకు జైశ్వాల్ రనౌట్ తోనే పునాది పడింది.
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీస్కోరుకు భారత్ ధీటుగానే బదులిచినట్టే ఇచ్చి అనూహ్యంగా చతికిలపడింది. 152 పరుగులకు 2 వికెట్ల నుంచి 159కి 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ వరుస వికెట్లకు జైశ్వాల్ రనౌట్ తోనే పునాది పడింది. కోహ్లీ, జైశ్వాల్ మధ్య కమ్యూనికేషన్ మిస్ అయ్యి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సెంచరీ దిశగా సాగిన యశస్వి జైస్వాల్.. అనసవర పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన 41వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బౌండరీ తరలించిన యశస్వి జైస్వాల్.. మరుసటి బంతిని మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి నేరుగా కమిన్స్ చేతులోకి వెళ్లడం గమనించిన కోహ్లీ.. సింగిల్ తీయకుండా వెనక్కి వెళ్ళాడు. బంతిని అందుకున్న కమిన్స్ వికెట్లను కొట్టగా.. మిస్సైంది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని అందుకొని రనౌట్ చేశాడు. మరోవైపు జైస్వాల్ మాత్రం క్రీజు మధ్యలోనే ఆగిపోయాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 102 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటి కోహ్లీ కూడా ఔటవ్వగా.. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోవడంతో ఐదో వికెట్ కూడా చేజార్చుకుంది.
కాగా ఆ\ ముగిసాక జైస్వాల్ రనౌట్ గురించి మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. విరాట్ కోహ్లీని తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రన్ తీయాల్సిందని, స్కూల్ మిస్టేక్ అంటూ విమర్శలు గుప్పించాడు. ఈ వ్యాఖ్యలను ఇర్ఫాన్ పఠాన్ తప్పుబట్టాడు. వెంటనే ఇర్ఫాన్ పఠాన్.. ఈ రనౌట్ విషయంలో కోహ్లీది ఎలాంటి తప్పిదం లేదని సంజయ్ మంజ్రేకర్‌కు కౌంటరిచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన హీటెక్కింది. అక్కడ పరుగు లేదని భావించి కోహ్లీ వెనక్కి తిరిగాడనీ, కానీ రన్ తీయాలా వద్దా అనేది నాన్‌స్ట్రైకర్ నిర్ణయం కాదనీ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ పరుగు తీయకపోవడంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశం లేకుండా పోయిందంటూ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వ్యాఖ్యలను ఇర్ఫాన్ పఠాన్ తప్పుబట్టాడు. ఫీల్డర్ చేతిలో బంతి పడినప్పుడు నాన్‌స్ట్రైకర్ కూడా పరుగు వద్దని చెప్పొచ్చన్నాడు. బంతి తన పక్క నుంచే వెళ్లడంతో ఆ వేగాన్ని పసిగట్టి కోహ్లీ పరుగుకు నిరాకరించాడని చెప్పాడు. పఠాన్ అభిప్రాయంతో ఆగ్రహానికి గురైన సంజయ్ మంజ్రేకర్.. ఇక్కడ రనౌట్ గురించి మాట్లాడుతున్నామని చెప్పగా… వెంటనే ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నానని, కోహ్లీని వెనకేసుకురావడం లేదన్నాడు. దాంతో మరింత ఆగ్రహానికి గురైన మంజ్రేకర్.. రన్ తీయవచ్చా లేదా అనేది ఇర్ఫాన్ పఠాన్ కోచింగ్ మాన్యువల్‌లో చేర్చాలని ఎద్దేవా చేశాడు.