లండన్ నుంచి కోహ్లీ రిటర్న్ కివీస్ తో సిరీస్ పై ఫోకస్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. త్వరలో యూకేలో సెటిల్ కానున్న కోహ్లీ ప్రస్తుతం తన సతీమణి అనుష్కశర్మ, కూతురు వామికాలను చూసేందుకు ఇటీవలే అక్కడికి వెళ్ళాడు.

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. త్వరలో యూకేలో సెటిల్ కానున్న కోహ్లీ ప్రస్తుతం తన సతీమణి అనుష్కశర్మ, కూతురు వామికాలను చూసేందుకు ఇటీవలే అక్కడికి వెళ్ళాడు. వచ్చేవారం కివీస్ తో టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో సొంతగడ్డపై అడుగుపెట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు కోహ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు న్యూజిలాండ్ సిరీస్ కీలకం కానుంది. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో విరాట్ కాస్త వెనకబడ్డాడు. జో రూట్ వరుస శతకాలతో చెలరేగిపోతుంటే.. విరాట్ మాత్రం 29వ సెంచరీ వద్దే ఆగిపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ను ఎంతో ఇష్టపడే కోహ్లీ కివీస్ పై చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు