కివీస్ తో రెండో టెస్ట్, కోహ్లీని ఊరిస్తున్న రికార్డులివే
భారత్, న్యూజిలాండ్ రెండో టెస్ట్ గురువారం నుంచి మొదలుకానుంది. పుణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రిపరేషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాయి. సిరీస్ 0-1తో వెనుకబడిన భారత జట్టు బెంగళూరు ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.
భారత్, న్యూజిలాండ్ రెండో టెస్ట్ గురువారం నుంచి మొదలుకానుంది. పుణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రిపరేషన్ లో ఫుల్ బిజీగా ఉన్నాయి. సిరీస్ 0-1తో వెనుకబడిన భారత జట్టు బెంగళూరు ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. సిరీస్ చేజారకుంటే ఉండాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలిచితీరాల్సిందే.. కాగా ఈ మ్యాచ్ లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తోంది. రికార్డుల రారాజుగా పేరున్న కోహ్లీ మరో 55 పరుగులు చేస్తే ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం కోహ్లీ 15 వేల 945 పరుగులతో ఉన్నాడు. పుణే టెస్టులో 55 రన్స్ చేస్తే ఆసియాలో 16వేల పరుగుల మైలురాయి అందుకోవడంతో పాటు సచిన్ తర్వాతి స్థానంలో నిలుస్తాడు. ఓవరాల్ గా ఆసియాలో సచిన్ టెండూల్కర్ 21 వేల 741 పరుగులతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.
ఆసియాలో అంతర్జాతీయ క్రికెట్ కు సంబంధించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో కోహ్లీ తర్వాత సనత్ జయసూర్, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. జయసూర్య 13,757 , ద్రవిడ్ 13,457 పరుగులు చేశారు. ఇక ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ 34 వేలకు పైగా రన్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత సంగక్కరా, రికీ పాంటింగ్ 27 వేలకు పైగా రన్స్ తో ఉండగా… ఇటీవలే కోహ్లీ 27 వేల పరుగులు మైలురాయి అందుకున్నాడు. విరాట్ 594 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించాడు. 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 27000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
ఇదిలా ఉంటే మరికొన్ని రికార్డులు కూడా కోహ్లీని ఊరిస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ లో డాన్ బ్రాడ్ మన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసిన తర్వాత కోహ్లీ మళ్ళీ శతకం సాధించలేదు. నిజానికి గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా రన్ మెషీన్ వెనుకబడ్డాడు. ఒకవైపు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతూ పరుగుల వరద పారిస్తుంటే విరాట్ మాత్రం సెంచరీ చేసి చాలా రోజులైపోయింది. గత వారం బెంగళూరు టెస్టులో 70 పరుగులకు ఔటవడం నిరాశపరిచినా కోహ్లీ ఫామ్ లోకి రావడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే పుణే టెస్టులో 30వ శతకం అందుకుంటాడని అంచనా వేస్తున్నారు. పైగా పుణే స్టేడియంలో కోహ్లీకి మంచి రికార్డుంది. దీంతో రన్ మెషీన్ నుంచే సెంచరీ ఖాయమని చెబుతున్నారు.