కోల్ కత్తాకు కొత్త కెప్టెన్, ఛాన్స్ అతడికేనా ?
ఐపీఎల్ మెగావేలం తంతు ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. పలు టీమ్స్ కొత్త ప్లేయర్స్ ను తీసుకోవడంతో పాటు కొత్త కెప్టెన్లనూ ఎంపిక చేసేందుకు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ చాలామంది ఆటగాళ్ళను వేలంలోకి వదిలేసింది.
ఐపీఎల్ మెగావేలం తంతు ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. పలు టీమ్స్ కొత్త ప్లేయర్స్ ను తీసుకోవడంతో పాటు కొత్త కెప్టెన్లనూ ఎంపిక చేసేందుకు రెడీ అవుతున్నాయి. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కత్తా నైట్ రైడర్స్ చాలామంది ఆటగాళ్ళను వేలంలోకి వదిలేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను కూడా వదిలేయడంతో ఇప్పుడు కొత్త సారథికి బాధ్యతలు అప్పగించబోతోంది. అయితే కోల్ కత్తాకు కెప్టెన్ గా చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మెగావేలంలో కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్, డికాక్, రహానే వంటి వారిని కొనుగోలు చేసింది. ముఖ్యంగా వెంకటేశ్ అయ్యర్‌ని 23 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంత భారీ ధర పెట్టి కొన్న అతనికే కెప్టెన్సీ అప్పగించబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఆఖరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్‌ను కోల్‌కతా సొంతం చేసుకుంది. గత సీజన్‌లో కూడా వెంకటేష్ అయ్యర్ కేకేఆర్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు.ఐపీఎల్‌లో వెంకటేష్ ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడి 1326 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఓసెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి,
కేకేఆర్ తరఫున రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ అతనొక్కడే. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ లెజెండరీ బ్యాటర్ మెక్‌కల్లమ్ పేరుమీద ఉండేది. వెంకటేష్ జట్టులో ఉంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ సమతౌల్యంగా ఉంటుందని భావిస్తోంది.
ఇదిలా ఉంటే రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్‌లను వేలానికి ముందు కోల్ కత్తా రిటైన్ చేసుకుంది. అయితే క్వింటన్ డి కాక్, మనీశ్ పాండే, అజింకా రహానేలకు ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం ఉంది. అలాగే ఆండ్రే రస్సెల్ కూడా ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కెప్టెన్సీ చేసినవాడే.. మిగిలిన కుర్రాళ్లకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. భారీ ధర దక్కించుకున్న ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌తో పాటు సెన్సేషనల్ బ్యాటర్ రింకూ సింగ్ కూడా కెప్టెన్సీపై ఆసక్తిగా ఉన్నారని సమాచారం. శ్రేయాస్ అయ్యర్ రూపంలో ఓ అయ్యర్‌ని వేలానికి వదిలేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్, మరో అయ్యర్‌కి కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటోందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కొత్త కెప్టెన్సీ ఆడబోతున్న డిఫెండింగ్ ఛాంపియన్ పై 2025 సీజన్ లోనూ భారీ అంచనాలుంటాయని చెప్పొచ్చు.